Telangana Budget 2026-27 Highlights: 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత? ఫుల్ లిస్ట్ ఇదే!

Telangana Budget 2026-27 Highlights: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Arun Chilukuri
Updated on: 20 March 2026 2:41 PM IST
Telangana Budget 2026-27 Highlights
X

Telangana Budget 2026-27 Highlights: 3.24 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత? ఫుల్ లిస్ట్ ఇదే!

Telangana Budget 2026-27 Highlights: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,24,234 కోట్ల భారీ వ్యయంతో ఈ పద్దును రూపకల్పన చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతంగా ఉందని, తలసరి ఆదాయం రూ. 4,18,931 కి చేరిందని భట్టి ఈ సందర్భంగా వెల్లడించారు.

బడ్జెట్ గణాంకాలు:

మొత్తం బడ్జెట్: రూ. 3,24,234 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు

మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు

ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 26,674 కోట్లు, వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్ల చొప్పున కేటాయించారు.

అదేవిధంగా పట్టణాభివృద్ధి, పురపాలక శాఖకు రూ.17,907 కోట్లు, న్యాయశాఖకు రూ.2,367 కోట్లు, రవాణా శాఖకు రూ.12,759 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.33,688 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు, చేనేతకు రూ.258 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,430 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు, రాజీవ్‌ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, శాంతిభద్రతలకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించినట్లు భట్టి తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story