Jeevan Reddy: బుజ్జగింపులు బేఖాతర్.. జీవన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏ పార్టీ?

Jeevan Reddy: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. 40 ఏళ్ల రాజకీయ బంధానికి స్వస్తి పలుకుతూ జగిత్యాలలో అనుచరులతో భేటీ కానున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 March 2026 9:34 AM IST
Jeevan Reddy
X

Jeevan Reddy: బుజ్జగింపులు బేఖాతర్.. జీవన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏ పార్టీ?

Jeevan Reddy: మాజీ మంత్రి, జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకోనున్నారు. రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు చివరి వరకు బుజ్జగించారు. అయినా జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయానికే మొగ్గు చూపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నేత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తో చర్చలు జరిపారు. జగిత్యాలలో ముఖ్యకార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.

రాజీనామా లేఖను ఏఐసీసీ, పీసీసీకి పంపించనున్నారు. మరో వైపు జీవన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయ పయనం ఎటు వైపు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు బీఆర్ఎస్ లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్తారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

జీవన్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ భవిశష్త్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపనున్నది. జీవన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనుచరుల అభిప్రాయంతో నడుచుకుంటారని భావిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story