Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ముగ్గురు నిందితులకు 3 రోజుల పోలీస్ కస్టడీ!

Moinabad Drugs Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఉప్పర్‌పల్లి కోర్టు.

Arun Chilukuri
Published on: 23 March 2026 5:02 PM IST
Moinabad Drugs Case
X

Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ముగ్గురు నిందితులకు 3 రోజుల పోలీస్ కస్టడీ!

Moinabad Drugs Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఉప్పర్‌పల్లి కోర్టు. మొత్తం ముగ్గురు నిందితులకు మూడురోజుల పాటు కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డిను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? ఈ ముఠాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? గతంలో ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు? అనే కోణంలో పోలీసులు వీరిని ప్రశ్నించనున్నారు.

కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రముఖులతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story