Dongli: డోంగ్లి మండల కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
Dongli: కామారెడ్డి జిల్లా డోంగ్లిలో శనగ కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.
Dongli: డోంగ్లి మండల కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
డోంగ్లి (కామారెడ్డి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం డోంగ్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
మద్దతు ధర క్వింటాలుకు ₹5,875:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఏడాది వాతావరణం అనుకూలించి శనగ దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్వింటాలు శనగకు ₹5,875 మద్దతు ధర నిర్ణయించిందని, రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు:
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సహకార సంఘం సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా హమాలీల కొరత లేకుండా చూడాలని, గన్నీ బ్యాగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి రైతులకు ఇబ్బంది కలిగిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్, ఛైర్మన్ ప్రతినిధి ఆయిల్వర్ రమేష్, సొసైటీ కార్యదర్శి బాబు రావు, సాయి పాటిల్, డీసీసీ వైస్ ఛైర్మన్ యూనస్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.




