Medchal: మల్లారెడ్డి దంపతుల 50 ఏళ్ల పెళ్లి వేడుక.. ఉగాది నాడే మల్లన్న వివాహం!

Medchal: ఎమ్మెల్యే మల్లారెడ్డి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది రోజే తమ పెళ్లి జరిగిందని గుర్తుచేసుకున్న మల్లారెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 March 2026 5:08 PM IST
Medchal
X

Medchal: మల్లారెడ్డి దంపతుల 50 ఏళ్ల పెళ్లి వేడుక.. ఉగాది నాడే మల్లన్న వివాహం!

మేడ్చల్: తనదైన శైలిలో రాజకీయాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ దూసుకుపోయే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మల్లారెడ్డి - కల్పనమ్మ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి.

తాడ్‌బండ్‌ హనుమాన్ సాక్షిగా..

ఈ సందర్భంగా మల్లారెడ్డి తన పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే ఉగాది రోజున సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ దేవాలయంలో తమ వివాహం జరిగిందని ఆయన వెల్లడించారు. ఒక మంచి భార్య దొరకడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, తన విజయాల్లో ఆమె పాత్ర కీలకమని మల్లారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

అభిమానుల కోలాహలం

వారం రోజులుగా సాగుతున్న ఈ వేడుకల్లో మల్లారెడ్డి అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మల్లారెడ్డి దంపతులను గజమాలలతో సత్కరించి, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలుచోట్ల భారీ కేక్స్‌ కట్‌ చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

విడాకులు వద్దు.. సంసారమే ముద్దు!

ఈ వేడుకల వేదికగా మల్లారెడ్డి యువతకు తనదైన శైలిలో ఒక సందేశాన్ని ఇచ్చారు. "ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే యువత విడాకుల వరకు వెళ్తున్నారు. పెళ్లి చేసుకున్న వారు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గొడవలు వచ్చినా విడాకులు తీసుకోకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి" అని ఆయన సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story