Peddapalli: రూ. 35 లక్షలతో కొత్త పనులు.. పిట్టల ఎల్లయ్యపల్లిలో అభివృద్ధి పనుల జోరు!

Peddapalli
x

Peddapalli: రూ. 35 లక్షలతో కొత్త పనులు.. పిట్టల ఎల్లయ్యపల్లిలో అభివృద్ధి పనుల జోరు!

Highlights

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు పర్యటన! పిట్టల ఎల్లయ్యపల్లిలో సీసీ రోడ్ల ప్రారంభం మరియు గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన.

Peddapalli: ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో 15 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం మరియు రూ. 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు..

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ..

తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్ల మూడు మాసల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకోవడం జరిగింది అని అన్నారు. ప్రజాపాలన - ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజా ప్రభుత్వంలో పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 65 లక్షలు రూపాయల నిధులతో గ్రామ అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది అని తెలిపారు. పాఠశాల కాంపౌండ్ వాల్ మరియు అంగన్వాడీ భవనం, మహిళా ఐకేపీ సంబంధించిన మహిళా సమైక్య భవనం కోసం వారం రోజుల్లో 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తి చేసుకోవడం జరుగుతుంది అని గ్రామప్రజల ఆలోచన మేరకే గ్రామ అభివృద్ధికి మంచి ప్రణాళికలు వేసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకుందామని అన్నారు.

త్వరలోనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణం పూర్తి అవ్వడంతోనే పిట్టలఎల్లయ్య పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని అలాగే ఓదెల నుండి పలు ప్రాంతాలకు ప్రజలు వెళ్లే విధంగా బస్సు సౌకర్యలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500/- రూపాయలకు గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు 500 బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్యాణలక్ష్మి/షాది ముబారక్ చెక్కులు అందించడం జరుగుతుంది అని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ఆర్థిక సహాయం, ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు అమలులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. దివ్యంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనలు పంపిణితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరవేసేలా ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించడం జరిగింది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటూ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కలిగినా కూడా సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మరియు మార్కెట్ డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories