Tummala Nageswara Rao: ఆయిల్‌ పామ్ సాగుతో లాభాల పంట.. నీటి కష్టాలు లేవు, మార్కెట్ భయం లేదు!

Tummala Nageswara Rao: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 14 March 2026 3:59 PM IST
Tummala Nageswara Rao: ఆయిల్‌ పామ్ సాగుతో లాభాల పంట.. నీటి కష్టాలు లేవు, మార్కెట్ భయం లేదు!
X

Tummala Nageswara Rao: ఆయిల్‌ పామ్ సాగుతో లాభాల పంట.. నీటి కష్టాలు లేవు, మార్కెట్ భయం లేదు!

సిద్ధిపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్‌ పామ్ ఫ్యాక్టరీని మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పనితీరును పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన, ఆయిల్‌ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఆయిల్‌ పామ్ ధరకు రెక్కలు

గతంలో ఆయిల్‌ పామ్ ధర టన్నుకు కేవలం రూ. 12 వేలు మాత్రమే ఉండేదని మంత్రి గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ప్రస్తుతం టన్ను ధరను రూ. 20 వేలకు పైగా పెంచగలిగామని ఆయన వెల్లడించారు. ఇది ఆయిల్‌ పామ్ సాగు చేసే రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నీటి సమస్య లేదు.. మార్కెట్ భయం లేదు!

రైతులు నిస్సంకోచంగా ఆయిల్‌ పామ్ పంటను సాగు చేయాలని మంత్రి సూచించారు. ఈ పంటకు నీటి ఎద్దడి సమస్య ఉండదని, అలాగే మార్కెటింగ్ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భరోసా ఇచ్చారు. "అన్ని విధాలా లాభదాయకమైన పంట ఇది. పెట్టుబడి, ఎరువులు వంటి అన్ని అవసరాలను ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది" అని ఆయన పేర్కొన్నారు.

త్వరలో రైతు మేళా

నర్మెట్ట ప్రాంత రైతుల కోసం త్వరలోనే ఒక భారీ 'రైతు మేళా' నిర్వహిస్తామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మేళా ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story