Karimnagar: స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన ధీరుడు

Karimnagar: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ నగర్ చౌరస్తాలో నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 3:26 PM IST
Karimnagar
X

Karimnagar: స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన ధీరుడు

Karimnagar: భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ అని మేయర్ కులగానే శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో సోమవారం రోజు భగత్ సింగ్ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలువురు కార్పోరేటర్లతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

స్వతంత్రం కోసం ఉరి కొయ్యను ముద్దడిన వీరుడు

మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... 23 ఏళ్ళ వయస్సులోనే దేశం కోసం ఇంక్విలాల్ జిందాబాద్ అంటూ ఉరి కొయ్యను ముద్దాడిన దీరాశాలీ అన్నారు. సమానత్వం ఉన్న సమాజం రావాలని కళలుకన్న వ్యక్తి అన్నారు. స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారి చేతిలో ఉరితీయబడిన భగత్ సింగ్ మరణం రోజును షహీద్ దివస్ గా జరురుకుంటామని తెలిపారు. నేడు మనం ఒక మహోన్నత త్యాగమూర్తిని స్మరించుకుంటున్నామని తెలిపారు. భగత్ సింగ్ కేవలం ఒక్క తుపాకీ పట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప మేధావి. వివక్ష లేని పోరాట పటిమ కలిగిన వ్యక్తి అన్నారు. మన యువత ఆయన పోరాట పటిమను, క్రమశిక్షణను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.

భగత్ సింగ్ దేశభక్తి అందరికీ ఆదర్శప్రాయం..

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వంటి అమరవీరుల బలిదానాల వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామని తెలిపారు. ఈ స్వేచ్ఛను కాపాడుకుంటూ, మన నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భగత్ సింగ్ ఆశయాలు మాటలు నేటి తరం యువతకు స్పూర్తి అన్నారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మాసం గణేష్, భారీ అపర్ణ, జితేంధర్, నాంపల్లి రేణుక శ్రీనివాస్, జితేంధర్, కొమురయ్య, పొన్నం లక్ష్మి మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story