LPG Shortage in Hyderabad: ఐటీ కారిడార్‌ హాస్టళ్లలో 'గ్యాస్' సెగ.. మెనూ నుంచి దోశ, పూరీ అవుట్.. టెక్కీలకు తప్పని తిప్పలు!

LPG Shortage in Hyderabad: పశ్చిమ ఆసియాలో (ఇజ్రాయెల్ - ఇరాన్) నెలకొన్న యుద్ధ వాతావరణం హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌పై అనూహ్య ప్రభావాన్ని చూపుతోంది.

Arun Chilukuri
Published on: 11 March 2026 11:29 AM IST
LPG Shortage in Hyderabad: ఐటీ కారిడార్‌ హాస్టళ్లలో గ్యాస్ సెగ.. మెనూ నుంచి దోశ, పూరీ అవుట్.. టెక్కీలకు తప్పని తిప్పలు!
X

LPG Shortage in Hyderabad: ఐటీ కారిడార్‌ హాస్టళ్లలో 'గ్యాస్' సెగ.. మెనూ నుంచి దోశ, పూరీ అవుట్.. టెక్కీలకు తప్పని తిప్పలు!

LPG Shortage in Hyderabad: పశ్చిమ ఆసియాలో (ఇజ్రాయెల్ - ఇరాన్) నెలకొన్న యుద్ధ వాతావరణం హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌పై అనూహ్య ప్రభావాన్ని చూపుతోంది. కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత భయంతో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ పరిధిలోని వందలాది హాస్టళ్లలో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టారు.

ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు మరియు నివాసితులకు కీలక నోటీసు జారీ చేసింది. గ్యాస్ సరఫరా మెరుగుపడే వరకు వంటల తయారీపై తాత్కాలిక ఆంక్షలు పాటించాలని కోరింది.

ప్రధాన మార్పులు ఇవే:

బ్రేక్‌ఫాస్ట్ కట్: ఎక్కువ గ్యాస్ వినియోగించే దోశ, చపాతీ, పూరీ వంటి టిఫిన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

పరిమిత మెనూ: కొన్ని రకాల కూరలు, అదనపు ఆహార పదార్థాలను మెనూ నుంచి తొలగించారు.

ప్రత్యామ్నాయాలు: కేవలం అన్నం, పప్పు వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందుబాటులో ఉంచాలని, ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అనుసరించాలని అసోసియేషన్ సూచించింది.

కేవలం హాస్టళ్లే కాకుండా, నగరంలోని ప్రముఖ హోటళ్లు కూడా గ్యాస్ కొరతతో అల్లాడుతున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఇప్పటికే అనేక హోటళ్లలో స్టౌలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందని, రోజుకు 2.3 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని తెలంగాణ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు. అయితే, కృత్రిమ కొరత సృష్టించకుండా (Hoarding) నియంత్రించేందుకు కొత్త బుకింగ్స్‌పై 25 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ విధించారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story