Komatireddy Venkat Reddy: ఆయన పీసీసీ చీఫ్ అయితే 100 సీట్లు పక్కా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 17 March 2026 4:55 PM IST
Komatireddy Venkat Reddy
X

Komatireddy Venkat Reddy: ఆయన పీసీసీ చీఫ్ అయితే 100 సీట్లు పక్కా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పీఠంపై జగ్గారెడ్డిని కూర్చోబెట్టాలని ఆయన బహిరంగంగా ప్రతిపాదించారు. జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అని, ఆయనను చూస్తుంటే దివంగత నేత పీజేఆర్ (PJR) గుర్తుకు వస్తారని కొనియాడారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో జగ్గారెడ్డి ముందుంటారని, ఆయన పీసీసీ చీఫ్ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

హరీష్ రావుపై ఫైర్.. కాళేశ్వరంపై ఆరోపణలు

బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హ్యామ్ (HAM) రోడ్ల టెండర్లు ఇంకా ఖరారే కాలేదని, అలాంటప్పుడు కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారని హరీష్ రావు ఎలా అంటారని ప్రశ్నించారు. ఆధారాలతో మాట్లాడితే అన్నింటికీ సమాధానం చెబుతామని సవాల్ విసిరారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగించిన మోటర్లన్నీ నాసిరకమైనవేనని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే నాణ్యత లేని మోటర్లను తీసుకువచ్చి ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ తక్కువ ఇస్తున్నామని రాజకీయ విమర్శలు చేయడం కాదు, దాన్ని నిరూపించాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story