కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి.. సీతారాముల కళ్యాణం కి అన్ని ఏర్పాట్లు

కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 5:40 PM IST
Karimnagar
X

కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి.. సీతారాముల కళ్యాణం కి అన్ని ఏర్పాట్లు

Karimnagar: సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ లోని 10 వ డివిజన్ కోతిరాంపూర్ గిద్దె పెరుమాండ్ల దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక కార్పోరేటర్ కొమురయ్య, పలువురు కార్పోరేటర్లతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు 15 డివిజన్ చింతకుంట లో హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని గర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

బోర్ నిర్మాణానికి భూమి పూజ..

దేవాలయ ఆవరణలో నూతన బోర్ నిర్మాణం కు స్థానిక కార్పోరేటర్ గడ్డి ప్రదీప్ తో కలిసి భూమీ పూజ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, సానిటేషన్ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో శ్రీరామ నవమి పర్వదినాన ప్రధాన దేవాలయాల్లో జరగబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లు, చేపట్టే పారిశుధ్య కార్యక్రమాల పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి పలు సలహాలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ 27 వ తేదీన నగర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో జరగబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాట్లు చేయాలని 66 డివిజన్ లలో దేవాలయాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

కళ్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు..

కళ్యాణ మహోత్సవాలు జరిగే ప్రధాన ఆలయాల్లో ఇంజనీరింగ్, సానిటేషన్ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్వహించేలా అధికారులు చర్యలు తీస్కోవాలన్నారు. కళ్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రధానంగా ఆలయాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో కార్మీకులతో దేవాలయాల పరిసరాలను పరిశుభ్రం చేయించాలన్నారు. డివిజన్ల వారిగా కార్మీకులతో కలుపు మొక్కలు, చెత్త చెదారం తొలగించి... ఆలయంలో ఏమైనా చదును కార్యక్రమాలు చేయాల్సి ఉంటే వాటిని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వాటర్ ట్యాంకర్ల సహాయంతో ఆలయాల వద్ద భక్తులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సై, జవానులు మీ డివిజన్ పరిదిలో సీతారాముల కళ్యాణ కార్యక్రమాలు జరిగే చోట మెరుగైన పారిశుధ్య పనులు నిర్వహించాలని అన్నారు. ఎక్కడ చెత్త కనబడకుండ ఆలయ పరిసరాలను శుభ్ర పరుచాలని ఆదేశించారు.

అన్నదానం లాంటి కార్యక్రమాలు దరిగే చోట రిక్షాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం నుండి ఆలయాల వద్ద వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. కళ్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి..

నగర పారిశుధ్య పనుల పై కూడ ప్రత్యెక దృష్టి పెట్టాలని పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు జరిగే డోర్ టూ డోర్ చెత్త సేతరణ సక్రమంగా జరిగేలా ఎస్సై లు, జవానులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి చెత్తను వేరు వేరుగా సేకరించాలన్నారు. స్వచ్చ్ ఆటోలు ప్రతి ఇంటి నుండి చెత్తను సెక్రిగేషన్ చేసి సేకరిస్తున్నారా తనిఖీ చేయాలని ఆదేశించారు. నగర పారిశుధ్య నిర్వహణ లో ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదు రాకుండ చర్యలు తీస్కోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ కుమార్, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, ఎంహెచ్ఓ సుమన్, డీఈలు దేవేంధర్, అరుణ్ కుమార్, ఓం ప్రకాష్, వెంకటేశ్వక్లు , ఏఈలు, సానిటేషన్ ఎస్సై లు, జవానులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story