Kakatiya University: కాకతీయ వర్సిటీలో రగిలిన నిరసన జ్వాల: శ్రీవిద్య ఆత్మహత్యపై విద్యార్థుల సమరం!

Kakatiya University: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్యకు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 March 2026 6:11 PM IST
Kakatiya University
X

Kakatiya University: కాకతీయ వర్సిటీలో రగిలిన నిరసన జ్వాల: శ్రీవిద్య ఆత్మహత్యపై విద్యార్థుల సమరం!

హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్యకు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు క్యాంపస్‌ను దిగ్బంధించాయి.

ఉద్రిక్తతకు దారితీసిన ముట్టడి:

మంగళవారం ఉదయం నుండే విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. "అధికారుల నిర్లక్ష్యం నశించాలి", "శ్రీవిద్య మృతికి బాధ్యులను శిక్షించాలి" అంటూ మిన్నంటిన నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. విద్యార్థులు వీసీ ఛాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ర్యాగింగ్ పై ధ్వజం:

యూనివర్సిటీలో ర్యాగింగ్ రాక్షస క్రీడ కొనసాగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడ్డారు. శ్రీవిద్య ప్రాణం పోవడానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story