Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో అకాల వర్షాల బీభత్సం: నేలపాలైన రబీ పంటలు...

Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో కురిసిన అకాల వడగండ్ల వానకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 12:30 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో అకాల వర్షాల బీభత్సం: నేలపాలైన రబీ పంటలు...

జుక్కల్ నియోజకవర్గం లొ గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా రైతులు సాగు చేస్తున్న రబి పంటలు దెబ్బ తినడంతో చేతికొచ్చిన పంట నెలకొరగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ మండలం హంగర్గ, చండే గావ్, మద్నూర్ మండలం అంతాపూర్, పెద్ద తడ్గుర్ , కోడ్చిర, పెద్ద కొడప్ గల్ మండలం బేగంపూర్, కస్లబాద్, బిచ్కుంద మండలం వాజిద్నగర్, బండ రెంజల్ గ్రామాల్లో వడగండ్ల వాన కారణంగా జొన్న, మొక్క జొన్న, గోధుమ, పొద్దు తిరుగుడు, వరి పంటలు దెబ్బ తిన్నాయని రైతులు తెలిపారు. దెబ్బ తిన్న పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దెబ్బ తిన్న పంటలపై ఏ ఏ పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్యే పరిశీలించిన రైతులకు నష్ట పరిహారం అందలేదు:

గత సంవత్సరం సైతం బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో దెబ్బ తిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే పరిశీలించి ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందెల చూస్తామని ఇచ్చిన హామీ హామీలకు మాత్రమే పరిమితం అయిందని ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ప్రతి సారి అకాల వర్షం కారణంగా దెబ్బ తిన్న పంటలపై అంచనా వెయ్యడం తప్ప ప్రభుత్వం నుండి మాత్రం ఏమాత్రం లాభం చేకూరడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story