Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై? ఇంటి వద్ద పార్టీ ఫ్లెక్సీల తొలగింపుతో..

Jeevan Reddy: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ‍యన నివాసం దగ్గర ఉన్న పార్టీ ప్రొటోకాల్‌ ఫ్లెక్సీలను తొలగించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు.

Arun Chilukuri
Published on: 17 March 2026 11:46 AM IST
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై? ఇంటి వద్ద పార్టీ ఫ్లెక్సీల తొలగింపుతో..
X

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై? ఇంటి వద్ద పార్టీ ఫ్లెక్సీల తొలగింపుతో..

Jeevan Reddy: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ‍యన నివాసం దగ్గర ఉన్న పార్టీ ప్రొటోకాల్‌ ఫ్లెక్సీలను తొలగించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసం ఎదుట ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను సైతం తొలగించారు. అయితే.. చింపిన ఫ్లెక్సీల చోట మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు జీవన్‌రెడ్డి అనుచరులు.

కాంగ్రెస్‌ పార్టీ ఆనవాళ్లు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 24 లేదా 25న కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఫ్లెక్సీల తొలగింపు అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. జీవన్‌రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story