Jeevan Reddy: పార్టీ మారాలనే ఆలోచనకు ఎమ్మెల్యే సంజయే కారణం

Jeevan Reddy: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 17 March 2026 3:23 PM IST
Jeevan Reddy: పార్టీ మారాలనే ఆలోచనకు ఎమ్మెల్యే సంజయే కారణం
X

Jeevan Reddy: పార్టీ మారాలనే ఆలోచనకు ఎమ్మెల్యే సంజయే కారణం

Jeevan Reddy: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ కారణంగా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు.. ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగ బద్దంగా తీసుకుంటానని చెప్పారు.

సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉడుంలా చేరారన్నారు. ఎన్నికల్లో కొన్నిసార్లు గెలిచాని.. కొన్ని సార్లు ఓడాను.. అయినా జగిత్యాల జిల్లాలలో పార్టీని బలోపేతం చేశానన్నారు. గౌరవాన్ని చంపుకొని రాజకీయాల్లో కొనసాగలేమని..రాజకీయాల్లో..ప్రజా జీవితంలో కావాల్సిందే గౌరవమన్నారు. ఆ గౌరవమే లేనప్పుడుత పార్టీలో కొనసాగగలమా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story