Jammikunta: సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 17వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు
Jammikunta
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన' కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా 17వ వార్డులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగురి ప్రశాంత్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు , అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
వార్డులోకి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు స్థానిక అడ్వకేట్ దూడపాక శ్రీనివాస్, వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ తో పాటు కౌన్సిలర్లు బత్తుల లక్ష్మయ్య, గుర్రం కావ్యపరశురాం, కుతాడి తిరుపతి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్‌లను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. చైర్మన్ హోదాలో మొదటిసారి తమ వార్డుకు వచ్చిన ప్రశాంత్ కుమార్‌కు శ్రీనివాస్ ప్రత్యేకంగా ఒక ఎంబ్రాయిడరీ ఫోటో ఫ్రేమ్‌ను కానుకగా ఇచ్చారు.
అనంతరం వార్డులోని ప్రధాన సమస్యలపై చర్చ జరిగింది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, అంతర్గత సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరారు. వార్డు అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు.
Jammikunta:: అడ్వకేట్ దూడపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ఫలాలు సమాజంలో ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల విజ్ఞప్తులపై మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ సానుకూలంగా స్పందించారు. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన ఉద్దేశమే ప్రజల వద్దకు పాలనను తీసుకురావడమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహేష్, కిరణ్ తో పాటు ఆర్.పిలు శ్రీదేవి, భాను, శిరీష, సరిత మరియు సి.ఎల్.ఆర్.పి జ్యోతి పాల్గొన్నారు. ఆశా వర్కర్ సుజాతతో పాటు వార్డు ప్రజలు మాలిక్ పాషా, శంకర్, స్వరూప, షమీమ్, సరోజన, రాజిరమ్మ పాల్గొన్నారు.




