Hyderabad Hit and Run: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం.. మూడు వాహనాలను ఢీకొట్టి పరార్..

Hyderabad Hit and Run: హైదరాబాద్ సిటీలో ఓ కారు డ్రైవర్ హిట్ అండ్ రన్ సాగించారు.

Arun Chilukuri
Published on: 18 March 2026 12:17 PM IST
Hyderabad Hit and Run
X

Hyderabad Hit and Run: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం.. మూడు వాహనాలను ఢీకొట్టి పరార్..

Hyderabad Hit and Run: హైదరాబాద్ సిటీలో ఓ కారు డ్రైవర్ హిట్ అండ్ రన్ సాగించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై అతివేగంగా వచ్చిన ఓ కారు వరుసగా మూడు కార్లను ఢీకొట్టి.. ఆగకుండా దూసుకు వెళ్లింది. మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.

గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ వేగం తగ్గించకుండా అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట వైపు పారిపోయాడు. పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న కారును గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story