Harish Rao: శ్రీశ్రీ స్టైల్లో హరీశ్ రావు సెటైర్లు: "సీఎం ఢిల్లీ వాయే.. జాబులేమో రాకపాయె!"

Harish Rao: తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు.

Arun Chilukuri
Published on: 23 March 2026 3:38 PM IST
Harish Rao
X

Harish Rao: శ్రీశ్రీ స్టైల్లో హరీశ్ రావు సెటైర్లు: "సీఎం ఢిల్లీ వాయే.. జాబులేమో రాకపాయె!"

Harish Rao: తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల దీన స్థితిని, అశోక్ నగర్ అభ్యర్థులపై జరుగుతున్న లాఠీచార్జీలను ప్రస్తావిస్తూ ఆయన మహాకవి శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ కవితను పేరడీ చేస్తూ చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటు వేసిన యువత ఇప్పుడు రోడ్ల పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగి కష్టం.. హరీశ్ రావు కవితాస్త్రం!

శ్రీశ్రీ బతికి ఉంటే కాంగ్రెస్ మోసాలను చూసి ఇలాగే రాసేవారేమో అంటూ హరీశ్ రావు వినిపించిన కవిత సభలో అందరి దృష్టిని ఆకర్షించింది:

"రాహుల్ గాంధీ మాటనమ్మి, ప్రియాంక గాంధీ బాస నమ్మి

కాంగిరేసుకు ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం.. ఎంత కష్టం"


"ముఖ్యమంత్రి డిల్లీ వాయే.. జాబు లేమో రాకపాయె

కడుపు మండీ ర్యాలి తీస్తే.. లాఠీచార్జి చేసుడాయే

తలలు పగిలి నెత్తురాయే.. అశోక్ నగరే చిత్తడాయే"

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, కానీ ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ఉద్యోగాల కోసం శాంతియుతంగా ర్యాలీలు తీస్తున్న అభ్యర్థులపై లాఠీచార్జీలు చేయడం, వారి తలలు పగలగొట్టడం అరాచకత్వానికి నిదర్శనమని విమర్శించారు.

కోచింగ్ సెంటర్లకు నిలయమైన అశోక్ నగర్ ఇప్పుడు పోలీసుల లాఠీ దెబ్బలతో, నిరుద్యోగుల కన్నీళ్లతో చిత్తడవుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story