HJ Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత!

HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి హెచ్.జే. దొర (83) శుక్రవారం కన్నుమూశారు.

Arun Chilukuri
Published on: 13 March 2026 4:37 PM IST
HJ Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత!
X

HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి హెచ్.జే. దొర (83) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ప్రమాదవశాత్తు కింద పడటంతో విషాదం:

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. దొర గారు ఈరోజు ఉదయం డయాలసిస్ చేయించుకోవడానికి నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను మళ్లీ నిమ్స్‌కు తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు.

శ్రీకాకుళం నుంచి సీవీసీ వరకు.. ఒక అద్భుత ప్రస్థానం:

1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన హెచ్.జే. దొర, 1965 బ్యాచ్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. తన సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1996 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. 2002లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డీజీగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. పదవీ విరమణ అనంతరం ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC)గా కూడా దేశానికి విశేష సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story