Farmer Alert: రైతన్నలకు హెచ్చరిక కరెంటు బావుల వద్ద అప్రమత్తంగా ఉండండి!

Farmer Alert: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మొత్కులగూడెం రైతులకు సాగు పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 3:50 PM IST
Farmer Alert
X

Farmer Alert: రైతన్నలకు హెచ్చరిక కరెంటు బావుల వద్ద అప్రమత్తంగా ఉండండి!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని మొత్కులగూడెం, చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నారు. పొద్దున్నే బావుల వద్దకు వెళ్లి రాత్రి వరకు అక్కడే ఉండి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని తరుణంలో మోటార్లు ఆన్ చేసే క్రమంలో రైతులు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, తోటి రైతులు సూచిస్తున్నారు.

బావుల వద్ద ఉన్న ఎలక్ట్రికల్ స్టార్టర్ బాక్సులలో వేడి కోసం పాములు, తేళ్లు వంటి విషజంతువులు చొరబడుతున్నాయి. నీరు పారుతుందా లేదా అనే ఆత్రుతలో రైతులు నేరుగా చేతులతో బాక్సులను తెరవడం ప్రమాదకరంగా మారుతోంది. ఒక్కోసారి ఈ బాక్సుల్లో పాములను చూసి రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అందుకే స్టార్టర్ బాక్సులను తెరిచేటప్పుడు నేరుగా చేతులు పెట్టకుండా, ఒక కర్ర సాయంతో తెరవడం ఉత్తమమని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story