Sitarampur: గ్యాస్ డీలర్లకు కలెక్టర్ వార్నింగ్.. నిబంధనలు మీరితే కఠిన చర్యలు

Sitarampur: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 4:13 PM IST
Sitarampur
X

Sitarampur: గ్యాస్ డీలర్లకు కలెక్టర్ వార్నింగ్.. నిబంధనలు మీరితే కఠిన చర్యలు

Sitarampur: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. సీతారాంపూర్ లోని నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాములో ఆకస్మిక చేశారు.

గృహ వినియోగదారుల, వాణిజ్య పరమైన సిలిండర్ల బుకింగ్, స్టాక్ నిల్వలు, రోజు వారీ సరఫరా తదితర వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆస్పత్రులకు సరఫరా అవుతున్న సిలిండర్లు, వాణిజ్యప్రమైన, గృహ అవసరాల సిలిండర్ల సరఫరా వివరాలు పరిశీలించారు.

గృహ వినియోగదారులకు ఇబ్బందులు రావొద్దు..

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. స్టాక్ నిలువలు, బుకింగ్ సంఖ్య తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి తెలియజేయాలని డీలర్లకు సూచించారు.

కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story