Karimnagar: కరీంనగర్ సిపిఐలో వేటు.. ముగ్గురు నేతలు అవుట్!

Karimnagar: కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యవర్గ సమావేశంలో ముగ్గురు నేతలపై సస్పెన్షన్ వేటు పడింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 9:17 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ సిపిఐలో వేటు.. ముగ్గురు నేతలు అవుట్!

కరీంనగర్/బ్యూరో: భారత కమ్యూనిస్టు పార్టీ.సిపిఐ.నుండి మర్రి వెంకటస్వామి,కంది రవీందర్ రెడ్డి,గరిగె శారద లను సస్పెండ్ చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.

కరీంనగర్ లోని సిపిఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య అధ్యక్షతన కార్యవర్గ,కౌన్సిల్ సమావేశం జరిగిందని, సమావేశంలో జిల్లాలో పార్టీ నిర్మాణం ప్రజాసంఘాల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని.

పార్టీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ,పార్టీ నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తూ నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నందున మర్రి వెంకటస్వామిని,పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, నిర్ణయాలను అతిక్రమించినందున కంది రవీందర్ రెడ్డి, గరిగె శారద లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జిల్లా కార్యవర్గ,కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరి ఏకగ్రీవ తీర్మానం మేరకు ముగ్గురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.

పార్టీ పేరును వినియోగించిన కఠిన చర్యలు..

పార్టీ నిర్ణయం మేరకు సభ్యుల సూచన మేరకు తీసుకున్నట్లు తెలిపారు.ఇక నుండి సిపిఐ పార్టీ కి మర్రి వెంకటస్వామి కి,కంది రవీందర్ రెడ్డి కి, గరిగె శారద కు ఎలాంటి సంబంధం లేదని,ఎక్కడైనా పార్టీ పేరు చెప్పి కార్యక్రమాలు చేసినట్లు పార్టీ దృష్టికి వస్తె వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానం చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story