Karimnagar: పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్న నాయకులు
Karimnagar: కరీంనగర్ సీపీఐలో సస్పెన్షన్ల కలకలం. పార్టీ నిబంధనలు తెలియని వారు తనను సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామి విమర్శించారు.
Karimnagar: పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్న నాయకులు
కరీంనగర్: సిపిఐ పార్టీలో 40 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిని సస్పెండ్ చేయాల్సిన తప్పులు ఏం చేశారని సిపిఐ మాజీ కార్యదర్శి మర్రి వెంకట్ స్వామి ప్రశ్నించారు. సిపిఐ పీటిక నియమ నిబంధనలు తెలవని వ్యక్తులు ఒంటెద్దు పోకడల సస్పెండ్ చేస్తున్నామని అనడం హాస్యాస్పదమన్నారు.
రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేయకూడదని విచారణ చేస్తున్నామని అన్నా కూడా చాడ వెంకటరెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మంచిది కాదన్నారు. సిపిఐ కౌన్సిల్లో సభ్యుని అయినా నాకు ఎలాంటి మీటింగు చర్చ ఉందని తెలపకుండా తనపై ఆరోపణలు చేసి ముగ్గురిని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేస్తే విచారణ చేసే అధికారం రాష్ట్ర నాయకత్వానికి ఉందని, నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉండి కూడా పిలవకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఎల్లవేళలా పార్టీ కోసమే పని చేస్తాను..
విద్యార్థి సంఘ నాయకుడి నుంచి నేటి వరకు సిపిఐ పార్టీలో ఉంటూ ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న నన్ను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఇప్పటికీ ఎప్పటికీ సిపిఐ పార్టీ అనుబంధంగానే ప్రజలతో మమేకమై సిపిఐ పార్టీ కోసమే పని చేస్తానని అన్నారు.
పార్టీని కనుమరుగు చేయడమే చాడ లక్ష్యం..
కరీంనగర్ అంటే కమ్యూనిస్టు పార్టీ అని గతంలో ఎంతో వైభవంగా వెలిగిన పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి చాడ వెంకటరెడ్డి కంకణ బద్దుడై పనిచేస్తున్నాడని ఆరోపించారు. దేశిని చిన్న మల్లయ్య పుణ్యమా అని చాలా వెంకటరెడ్డి ఎమ్మెల్యే అయ్యిందని ఆ ఘనత దేశని చిన్న మలయ్య కే చెందుతుందన్నారు. నాడు కరీంనగర్లో వైభవోపేతంగా వెలిగిన సిపిఐ పార్టీ నేడు విలవిల బోతుందని దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తానన్నాడు.
తప్పు చేస్తే నిలదీయాలి..
సిపిఐ కార్యాలయాన్ని రెనోవేషణ్ కోసం తన సొంత డబ్బులను వెచ్చించి నిర్మాణం చేస్తూ కూలీల పని చేశానని అలాంటి నన్ను సస్పెండ్ చేసేంత తప్పు ఏం చేశానని చాడాను నిలదీశారు. తప్పు జరిగితే కుటుంబ పార్టీల అందర్నీ కలుపుకొని విచారించి తప్పు చేసిన వారికి వివరణ ఇచ్చుకుని అవకాశం కల్పించాల్సిన నాయకత్వం తప్పు చేస్తున్నారు. జిల్లా పార్టీ నాయకత్వంపై రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశామని దీనిపై పూర్తిస్థాయిలో రాష్ట్ర నాయకత్వం విచారణ చేపడుతుందని నిజమైన నాయకులకు ఎప్పటికీ సముచిత స్థానమే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




