Siddipet: నేడు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Siddipet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నర్మెట్టలో రూ. 300 కోట్ల ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు, రూ. 3,590 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 March 2026 3:16 PM IST
Siddipet
X

Siddipet: నేడు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సిద్దిపేట: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు రైతులకు భారీ ఎత్తున పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు.

ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం:

నంగునూరు మండలం నర్మెట్టలో రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీనితో పాటు రిఫైనరీ ప్లాంట్, జిల్లా జైలు, ఆయూష్ ఆసుపత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ మరియు పిహెచ్‌సీ (PHC)లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.

విద్యా రంగానికి పెద్దపీట:

గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్, కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ఈ ప్రాజెక్టులు చేపట్టారు.

రైతులకు పెట్టుబడి సాయం:

నర్మెట్టలో ఏర్పాటు చేసిన 'రైతు ఉత్సవాలు' వేదిక నుంచి యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. తొలివిడతగా రూ. 3,590 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎకరం లోపు భూమి ఉన్న సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలపై మరిన్ని ప్రత్యక్ష కథనాలను మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story