విద్యుత్ బస్ ల విధానం - ఆర్టీసి పై, ప్రజలపై, కార్మికులపై పెనుబారం!
కరీంనగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యుత్ బస్సుల విధానంపై కీలక చర్చ జరిగింది.
విద్యుత్ బస్ ల విధానం - ఆర్టీసి పై, ప్రజలపై, కార్మికులపై పెనుబారం!
కరీంనగర్: విద్యుత్ వస్తున విధానం ప్రజలు కార్మికుల పై పడే భారం పై సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం ముకుందలాల్ మిశ్రా భవన్ లో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, సహాయ కార్యదర్శి పున్నం రవి, కోశాధికారి జి రాజేశం, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు జి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఏ రామ్మోహన్, స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు పి మల్లయ్య, రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ భద్రయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
విద్యుత్ బస్సుల విధానంతో రాష్ట్రాల హక్కులను కేంద్రం గుంజుకున్నది..
ఈ సందర్భంగా గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ ఎం. వి. యాక్ట్ సవరణ 2019, విద్యుత్ బస్సుల విధానంతో రాష్ట్రాల హక్కులను కేంద్రం గుంజుకున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల పథకాలన్నీ కూడా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) పద్ధతిలో ఉన్నాయి. బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ అన్ని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలే చూస్తాయి. ఆర్టీసిలకు ఎటువంటి పాత్ర వుండదు. కేవలం బస్సులు నడిచే రూట్ నిర్ణయించడం, చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఆ బస్ను తిప్పినా, తిప్పకపోయినా, ప్రతి నెలా ఆ విద్యుత్ బస్సుల కంపెనీకి డబ్బులు చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు విద్యుత్ బస్సుల పథకాల అమలు కోసం కేంద్ర ప్రభ్వుం 1,11,651 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క రూపాయి కూడా ఆర్టీసీలకు ఇవ్వలేదు. ప్రైవేట్ ఆపరేటర్స్ కు రెవెన్యూ రిస్క్ లేకుండా చేయడానికే 'గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్' (జిసిసి) పద్ధతిలో తెచ్చారన్నారు. విద్యుత్ బస్ స్కీం అమలులో ఆర్టీసిలకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసి కేవలం దేశీయ, అంతర్జాతీయంగా ప్రైవేటు పెట్టుబడిదారులకు లాభాల గ్యారెంటీ చేయడంతో పాటు మొత్తం ప్రజా రవాణా సంస్థలను వారికి అప్పచెప్పడానిని CITU వ్యతిరేకిస్తుందన్నారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి, ఆర్టీసిలకు అవకాశం కల్పించాలన్నారు.
ప్రజలపై భారం పడకుండా చూడాలి..
కరీంనగర్-2 డిపో నుండి నడుస్తున్న విద్యుత్ బస్సులకు జిసిసి పద్ధతిలో కి.మీ. రూ.39.80/-లు, ప్రతి సంవత్సరం 2% ఖరీదు పెంచేలా ఒప్పందం జరిగిందన్నారు. మొత్తం కి.మీ. ఖర్చు రూ. 54.80 గా ఉన్నదని అన్నారు. విద్యుత్ బస్సుల్లో 100 కి.మీ. లోపు ప్రయాణిస్తున్న వారు రూ.10/-లు, ఆపైన రూ.20/-లు ప్రతి ప్రయాణికుడు చెల్లిస్తున్నారు. విద్యుత్ బస్లు పెరుగుతున్న కొద్ది ఈ భారం ప్రజలపై మరింత పెరుగుతుందన్నారు.
జిసిసి పద్ధతిని రద్దు చేయాలి
ఆర్టీసిలో 2025 డిశంబర్ నాటికి 38,535 మంది కార్మికులు వున్నారు. 2019 డిశంబర్లో మొత్తం 49,700 మంది వుండగా, 6 సంవత్సరాలలో 11,165 మంది తరిగి పోయారు. వీరుకాక సుమారు 10,000 కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులకు 2021, 2025 పే స్కేల్స్ ప్రకటించలేదు. 2017 పే స్కేలు అరియర్స్ చెల్లించడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిసిసి పద్ధతిని రద్దు చేయాలి, ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఆర్టీసిలకు ఇవ్వాలి. ఆర్టీసి లే నేరుగా విద్యుత్ బసు సమకూర్చుకొనేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.




