మతోన్మాదం దేశానికి ప్రమాదకరం.. భగత్ సింగ్ వర్ధంతి వేళ సిఐటియు హెచ్చరిక

కరీంనగర్‌లో భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 5:09 PM IST
Karimnagar
X

మతోన్మాదం దేశానికి ప్రమాదకరం.. భగత్ సింగ్ వర్ధంతి వేళ సిఐటియు హెచ్చరిక

Shaheed Diwas: భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ముకుంద లాల్ మిశ్రా భవన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆనాడు భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం అర్పిస్తే మేం సామ్రాజ్యవాదానికి బలైన వారికి మా రక్తాన్ని అందిస్తున్నామని భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం రక్తదాన శిబిరంతో పాటు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా సిఐటి నేతలు తెలియజేశారు.

CITU జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి మాట్లాడుతూ నాటి బ్రిటీష్ సామ్రాజ్యవాదం వలస పాలనను ఎదిరించి దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపై నిలిపి వీరోచితంగా పోరాడి బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టి, దేశాన్ని విముక్తి చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం మూర్ధాబాద్ అని తను ఇచ్చిన నినాదం కోట్లాది మందికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపింది.

చావును సైతం దిక్కరించిన, అతని ధైర్య సాహసాలు త్యాగం, దేశభక్తి, దృఢ సంకల్పం నేటికీ కూడా భారత ప్రజల మనసుల్లో శిరస్మనీయంగా వెలుగొందుతూ, భగత్సింగ్ అనేక పోరాటాలకు నిత్యం స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు. తాము సాగించే పోరాటం కేవలం, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే కాక, మొత్తం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అని చెప్పాడు.నేడు ప్రపంచం మీద అమెరికా సామ్రాజ్యవాదం అత్యంత దుర్మార్గంగా,ఏకపక్షంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.

ఆక్రమణలు, దురాక్రమణలకు పాల్పడుతున్నది. ప్రపంచ దేశాలపై యుద్ధాలు ప్రకటిస్తుంది. ప్రజలు, పసిపిల్లలను సహితం నిర్దాక్షిణ్యంగా హతమారుస్తుంది. ప్రపంచ శాంతికి విఘాతం కల్పిస్తుంది. బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం, తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ, ప్రపంచ ఆదిపత్యం కోసం యుద్ధాలు, విధ్వంసాలకు దిగుతున్న సందర్భంలో నాడు సామ్రాజ్యాధిపత్యం పై పోరాడి వీర మరణం పొందిన, దేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడు , సోషలిస్టు విప్లవకారుడు అయిన భగత్ సింగ్ ను దేశంలో స్మరించుకుంటున్నాం.

ప్రపంచ వినాశనాన్ని కోరేది సామ్రాజ్యవాదం..

సామ్రాజ్యవాదాన్ని ప్రథీఘటించి పోరాడిన భగత్ సింగ్ చైతన్య స్పూర్తి ఈ దేశానికి అవసరం. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వలసవాదం పై పోరాడిన చరిత్ర మనది. అలాంటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటస్ఫూర్తిని దేశం మరింత కొనసాగించాల్సిన అవసరం ఉంది.భగత్ సింగ్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట మార్గం కావాలి బరితెగిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం, ప్రపంచ పోలీసు లాగా వ్యవహరిస్తూ, ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న, దేశాలపై యుద్ధాలు ప్రకటిస్తూ, విధ్వంసాలు సృష్టిస్తుంది. దేశాలను ఆక్రమించడమే కాదు, దేశాధ్యక్షులను సైతం ఎత్తుకెళ్లి బంధించడం,లేదా చంపడమే చేస్తుంది.

అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తుంది. ఆయా దేశాల అంతరంగిక వ్యవహారా ల్లో అక్రమంగా చొరబడి సంపదల కొల్లగొడుతుంది. మానవ హోమానికి పాల్పడుతుంది. సామ్రాజ్యవాదం అనేది ఎప్పుడు ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటుంది. సామ్రాజవాదానికి వ్యాపార మార్కెట్లు కావాలి, తప్ప ప్రపంచ ప్రజల ప్రయోజనాలు కాదని తెలిపారు.

వర్గ రహిత సమాజం కోసం పోరాటం..

CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గురించి ప్రతి సారి హెచ్చరిస్తూనే ఉండేవాడు. సామ్రాజ్యవాదం అనేది దోపిడీ కుతంత్రాలతో నిండిన భారీ కుట్ర తప్ప, మరొకటి కాదని చెప్పాడు. ఒక మనిషిని, మరొక మనిషి, ఒక దేశాన్ని మరొక దేశం దోచుకునేదే సామ్రాజ్యవాదం. తమ కోర్టులు, చట్టాల ద్వారా అధర్మంగా, హత్యలకు పాల్పడడమే కాదు, సాధారణ ప్రజల పై అత్యాకాండలకు, వినాశనాలకు, యుద్ధాలు వంటి భయంకరమైన నేరాలకు పాల్పడుతుంది అంటాడు.

వారి మాటలు లెక్కచేయని అమాయక ప్రజలను నీరాశ్రేయులను కాల్చి చంపేయడానికి వారు ఏ మాత్రం ఆలోచించరు. శాంతి భద్రతల పరిరక్షకులమనే ముసుగులో వారు శాంతిని నాశనం చేస్తారు. అశాంతిని రగిలిస్తారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమే కాదు, ఈ దేశంలో సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పుడమే తమ అంతిమ లక్ష్యమని భగత్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని, మరొక జాతి దోపిడి చేయని, వర్గ రహిత సమాజం తమ లక్ష్యం అని ప్రకటించారు.

మన దేశంపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా..

అమెరిక మన దేశంపై కూడా అనేక ఆంక్షలు విధిస్తూ, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది . దేశంపై సుంకాల పేర, వాణిజ్య యుద్దం సాగిస్తుంది. దేశ ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం చేస్తున్న , అమెరికా దుశ్చర్యలపై మోడీ మౌనం వహిస్తున్నాడు. అమెరికా సామ్రాజ్యవాదులతో మిలాఖాత్ అయ్యి, దేశ సార్వ బౌమత్వాన్ని అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు బిడుతూ లొంగూ బాటు ప్రదర్శిస్తూన్నారు. సుంకాలు విధిస్తూ దేశానికి తీవ్రనష్టం చేస్తున్నా, దేశం పట్ల అవమానకరంగా వ్యహరిస్తున్నా, ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు దేశ పాలకులు. మన దేశ స్వతంత్ర విదేశాంగ విధానంలో అమెరికా జోక్యం మరింత పెరుగుతుంది. బయటి దేశాలతో వాణిజ్య సంబంధాలు ఎలా ఉండాలో, దౌత్య సంబంధాలు ఎలా కొనసాగించాల నిధి అమెరికా నిర్దేశిస్తుంది.

దేశానికి అవసరమైన ఆయిల్ ఎవరి దగ్గర కొనాలో కూడా అమెరికా నిర్దేశించడం సిగ్గుచేటు. బ్రిటీష్ వలసవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వారసత్వం కలిగిన దేశం మనది.ఇప్పుడు అమెరికా ముందు మోకరిల్లడం దేశానికి అవమానకరం. ఈ సందర్భంలో మనకు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి కావాలి ఇప్పుడు.భగత్సింగ్ కోరుకున్నది సామ్యవాద విప్లవం. భారతదేశంలో సోషలిస్టు రాజ్యాల రిపబ్లిక్ ను నిర్మించడమే అతని ధ్యేయం. అతడు అగ్రగామిగా ఉంటూ నడిపించిన విప్లవ సంస్థ పేరు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్. భగత్ సింగ్ ముందున్న విప్లవకారుల ప్రధాన లక్ష్యం, దేశ స్వాతంత్ర్యం మాత్రమే. కానీ ఆ స్వాతంత్ర్యం, ఒక మనిషిని, మరో మనిషి దోసుకుంటుండగా నిజంగా మనం స్వాతంత్రాన్ని అనుభవించగలమా?

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి కావాలి..

భగత్ సింగ్ ను ఉరి తీయుటకు ముందు ఇచ్చిన అంతిమ సందేశంలో, భారత దేశంలో పోరాటం స్వప్రయోజనాల కోసం సామాన్యుల శ్రమను కొద్దిమంది దోపిడీదారులు దోసుకున్నంతకాలం కొనసాగుతుందని అంటాడు. ప్రజలను దోచుకునే దోపిడీదారులు, స్వదేశీ వాళ్ళా,విదేశీ పెట్టుబడిదారులా అనేదానితో నిమిత్తం లేదంటాడు. సామ్యవాదాన్ని ఆయన శాస్త్రీయంగా నిర్వహిస్తూ, పెట్టుబడుదారితనాన్ని, వర్గాధిపత్యాన్ని నిర్మూలించేదే నిజమైన సామ్యవాదమనీ చెబుతాడు. మార్క్సిజాన్ని, వర్గ దృక్పథాన్ని ఆయన పూర్తిగా ఆమోదించాడు.భగత్ సింగ్ సామ్రాజవాదానికి, మతం, మతతత్వ రాజకీయాలకు, దోపిడీకి మాత్రమే మతోన్మాదానికి కూడా వ్యతిరేకి. అతను ఎప్పుడూ తనను నాస్తికుడుగానే భావించాడు.

నేను నాస్తికుడు ఎందుకు అయ్యాను అంటూ తాను రాసిన వ్యాసంలో ఈ దేశంలో కులం,మతతత్వం, మతోన్మాదం పట్ల ఆయన ఆలోచనలు స్పష్టం చేస్తాయి. మతం వ్యక్తిగతం, మతతత్వం మన శత్రువు అని ఆయన స్పష్టం చేశాడు. మత విద్వేషంతో రగిలిపోతున్న హంతకులు ఎదుటివాడు వ్యక్తిగతంగా, ఏదో నేరం చేసినందుకు వాడిని చంపడం లేదని, వాడు హిందూ లేదా ముస్లిం లేదా సిక్కు మతాల వారిగా మనుషులను విభజిస్తూ ,ఆ మత కోణంలోనే చంపుతున్నారని వ్యాఖ్యానించారు.

నేటి పరిస్థితుల్లో దేశమంటే, మతమే అన్న విధంగా మనుషులను విడగొట్టి, వైషమ్యాలు సృష్టిస్తున్నారు. మతానికి అతీతంగా వ్యవహరించే కొత్తతరం యువత రాబోతున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తిని ముందుగా మానవుడుగా, ఆ తర్వాత భారతీయుడుగా ఆయన గుర్తించాడు. మతం, మూడవిశ్వాసాల నుండి ప్రజలను విముక్తి చేయాల్సిన అవసరాన్ని భగత్ సింగ్ గుర్తించాడు. మతోన్మాదం వలసవాదం కంటే కూడా ప్రమాదకరమైనదని భగత్ సింగ్ చెప్పాడు. కుల సమస్య, అంటరానితనం పాటించడాన్నీ తీవ్రంగా వ్యతిరేకించాడు. పెంపుడు కుక్కను ఒల్లో కూర్చోబెట్టుకుంటాం, కానీ సాటి మనిషినీ ముట్టుకుంటే మహిల పడిపోతాం ఎంత సిగ్గుచేటు. ఈ మాటలు షహిద్ భగత్ సింగ్ అంటరానితనం సమస్యపై రాసిన వ్యాసంలోనివి.

ప్రజలలో పోరాడే చైతన్యాన్ని అణచివేస్తున్నారు..

మనదేశంలో ఉన్నన్ని దుర్భర పరిస్థితులు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవు. కులం పేరుతో వివక్షత పాటించడం, గుల్లలోకి నిరాకరించడం,దాడులు, దౌర్జన్యాలు చేయడం నేటికి కూడా పాలక ప్రభుత్వాలు అమలు చేస్తున్నవి. నేడు దేశానికి మతోన్మాదం, మతతత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరంగా మారినవి. ఒకపక్క సామ్రాజ్యవాద దాడి, మరోవైపు మతోన్మాద దాడి జరుగుతుంది. అమెరికా సామ్రాజ్యవాదం దేశంలోని కార్పోరేట్ ,మతతత్వ వాదులతో జతకట్టి ఈ దేశం మీద జంటగా దాడి చేస్తున్నది. దేశం పేరుతో ద్వేషం , విద్వేషాలు నింపుతున్నారు.

ప్రశ్నించడం నేరంగా చూస్తున్నారు. కార్పొరేట్, మతతత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా మాట్లాడితే దేహద్రోహ ముద్రలు వేస్తున్నారు. ప్రజల్లో పోరాడే చైతన్యాన్ని అణచివేస్తున్నారు. మతవాద, మితవాద రాజకీయాలతో దేశంలో మతతత్వాన్ని నింపుతున్నారు. దేశ పౌరులుగా నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్న మతతత్వ, మతోన్మాద, కార్పోరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రపంచాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సామ్రాజవాదానికి వ్యతిరేకంగా కలసికట్టుగా ఐక్యంగా పోరాడటమే భగత్ సింగ్ కు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్,TGUEEU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు నలువాల స్వామి,జిల్లా సహాయ కార్యదర్శి మడిపెల్లి మహేందర్, కోశాధికారి రాజేశం,హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాగుల తిరుపతి, నాయకులు గురుభూషణ్,నవీన్, కిషన్, ప్రభాకర్,సమ్మయ్య,శాతవాహన యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షుడు ముల్కల దేవేందర్,నాయకులు సాయికుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అశోక్,ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story