Karimnagar: మున్సిపల్ బడ్జెట్ అంతా కాపీ పేస్ట్.. ప్రజలపై పన్నుల భారమా?
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌పై బిఆర్ఎస్ నగరాధ్యక్షులు చల్ల హరిశంకర్ మండిపడ్డారు.
Karimnagar: మున్సిపల్ బడ్జెట్ అంతా కాపీ పేస్ట్.. ప్రజలపై పన్నుల భారమా?
కరీంనగర్: మున్సిపల్ బడ్జెట్ సమావేశం చూసిన తర్వాత కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ డిమాండ్ చేసారు. నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు మేయర్ పదవి ఇస్తే కేంద్రం నుంచి సంవత్సరానికి ₹200 కోట్లు నిధులు తెస్తానని నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన బండి సంజయ్ నిన్న బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎందుకు పెట్టలేదు.
ప్రత్యేక అధికారుల పాలనలో రూపొందించిన బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేసి పెట్టారు. బడ్జెట్ లో నిధులను ఎలా సమీకరిస్తారో పేర్కొనలేదు. పండుగలకు పెట్టే ఖర్చులను తగ్గించిన బీజేపీ పాలక వర్గం అవసరం లేకున్న నియమించిన ఉద్యోగులు, వారు వాడుతున్న వాహనాల వృథా ఖర్చులు తగ్గించాలి.18 వేల ఇండ్లపై పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలి.మున్సిపల్ కు ఆదాయం ఒక్క ఆస్తి పన్ను ద్వారానే కాదు అడ్వర్టైజ్, ఎంటర్టైన్మెంట్ ద్వారా వస్తుంది.
ప్రజలపై పన్నుల భారం వేయొద్దు..
మేము ప్రజలను మోసం చేసి గెలిచినమని బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.కాంగ్రెస్ కార్పొరేటర్లను చూస్తే జాలేస్తుంది.వారే అధికారంలో ఉండి. కుక్కలు, కోతుల బెడద గురించి నిరసన తెలపడం శోచనీయం.ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత అక్రమ కట్టడం అంటూ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీ కమిషన్ల కోసం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
నగరంలో పర్మిషన్ లేని ఇండ్లను కూలుస్తారా..
డంప్ యార్డ్, తరలించడం నగర అభివ్రుద్ది చేయడం నాతో కాదని బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మున్సిపల్ కు నిధులు కావాలంటే చాలా దారులు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ బోర్డుల నుండి యూజర్ చార్జెస్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ద్వారా అనధికార లేఔట్ లను రెగ్యులర్ చేయడం ద్వారా. చేంజ్ ఆప్ లాండ్స్ ద్వారా ఇంక చానా మార్గాల ద్వారా నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచతందుకు అవకాశం ఉన్నా కూడా సామాన్యుల ఇంటి పన్ను పెంచి వసూలు చేయడం దారుణం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కచ్చు రవి, బిఆర్ఎస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థులు బండ శ్రీకాంత్, రాజకుమార్, బిఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, మైనార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్ బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆరె రవి గౌడ్ చేతి చంద్రశేఖర్ తొంటి రాజేందర్ మంతెన కిరణ్ గూడెల్లి రాజ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు నారదాసు వసంతరావు సత్తినేని శ్రీనివాస్ సుంకేపాక విద్యాసాగర్ , మిడిదొడ్డి నవీన్, నాయకురాలు గంటల రేణుక, సయఫ్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




