Karimnagar: భయపడే ప్రసక్తే లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం!
Karimnagar: బీఆర్ఎస్ నేత పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అర్థరాత్రి అక్రమ అరెస్ట్. ప్రభుత్వం అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తోందని విమర్శ.
Karimnagar: భయపడే ప్రసక్తే లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం!
Karimnagar: అర్ధరాత్రి ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారని, జిల్లా వ్యాప్తంగా ఇండ్లలోకి వచ్చి BRSV మరియు BRS నాయకులను అరెస్ట్ లు చేస్తూ పోలీస్ స్టేషన్ లకు తరలించడం అక్రమ చర్యలను వీటిని ఖండిస్తున్నా అని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఏ పిలుపునిచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమ కారులైన BRS నాయకులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి అభద్రతా భావం తో అసలేం జరుగుతుంది అనేది కూడా వారికి తెలియట్లేదు అని అందుకే ఎక్కడ చీమ చిటుక్కుమన్నా బీ ఆర్ ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.
అభద్రతాభావంతో అరెస్టులు..
అర్థ రాత్రి దొంగలలాగా పట్టుకు వచ్చి స్టేషన్ లలో కూర్చోబెట్టాలని సీఎం ఆర్డర్ వేస్తూ పోలీస్ లతో ఇలా చెప్పించడం వలన సీఎం కు అభద్రతా భావం బీ ఆర్ ఎస్ పార్టీ పట్ల తన అక్కసు వెళ్లగక్కుతున్నారు అని విమర్శించారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి అక్రమ అరెస్ట్ లు చేసి ఇండ్లలోకి అర్థరాత్రులు వచ్చి అరెస్ట్ లు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రభుత్వం పై ప్రశ్నించడాన్ని ఆపేది లేదని ఈ అరెస్ట్ లకు భయపడేది లేదని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.




