బేడ బుడగ జంగాల వారికి చైర్మన్ పదవులు కల్పించాలి. వినతి పత్రం!
హైదరాబాద్‌లో బేడ బుడగ జంగం జన సంఘం నేతలు మంత్రులు అల్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
బేడ బుడగ జంగాల వారికి చైర్మన్ పదవులు కల్పించాలి. వినతి పత్రం!
హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ గ్రూప్-1 పరిధిలో ఉన్న బేడ బుడగ జంగం వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ ఆ కుల జన సంఘం నేతలు సోమవారం హైదరాబాద్‌లో పలువురు రాష్ట్ర మంత్రులను కలిశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను విడివిడిగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఉద్యోగ నియామకాలు, పదోన్నతులలో తమ వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని నేతలు కోరారు. ఎస్సీ గ్రూప్-1లో మేజర్ కులమైన బేడ బుడగ జంగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దానికి ఈ కులానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రూ.5,000 కోట్ల భారీ నిధిని కేటాయించాలని మంత్రులకు విన్నవించారు.




