పర్యావరణాన్ని కాపాడండి.. అక్రమ తవ్వకాలు ఆపండి కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్ జిల్లాలో ఎల్లమ్మ గుట్ట అక్రమ మట్టి తవ్వకాలపై జాతీయ బీసీ సంఘం నేషనల్ కో-ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఫిర్యాదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 March 2026 7:49 PM IST
Akula Vivek Patel
X

పర్యావరణాన్ని కాపాడండి.. అక్రమ తవ్వకాలు ఆపండి కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్/బ్యూరో: జిల్లాలోని సహజ వనరులైన గుట్టలను అక్రమార్కుల నుంచి రక్షించాలని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం నేషనల్ కో-ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ సోమవారం 'ప్రజావాణి'లో జిల్లా కలెక్టర్‌తో పాటు మైనింగ్ ఏడీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వివేక్ పటేల్ మాట్లాడుతూ.. జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లమ్మ గుట్టను అక్రమంగా తవ్వి మట్టిని తరలిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల కళ్లముందే గుట్టలు కరిగిపోతున్నా, మైనింగ్ శాఖ పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story