ఆ వార్నింగ్.. కాంగ్రెస్ సీనియర్లకే.. బండి సంజయ్ ఘాటు విమర్శలు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను కరీంనగర్లో మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా జరుపుకున్నారు.
ఆ వార్నింగ్.. కాంగ్రెస్ సీనియర్లకే.. బండి సంజయ్ ఘాటు విమర్శలు
Bandi Sanjay: కరీంనగర్ లో మీడియా, కార్యకర్తలతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్న బండి సంజయ్. పరాభవ నామ సంవత్సరం ‘విజయానికి పునాది’ కావాలని, రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఆ వార్నింగ్....కాంగ్రెస్ సీనియర్లకే
ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులున్నరు. వాళ్లందరినీ తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నడు. ఈ మధ్య కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్ లు పెడుతున్నరు.
వాళ్లను ఉద్దేశించే సీఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుంది’’ అని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ సైతం తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని అన్నారు. ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపైనే మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని చెప్పారు.
కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం
సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడం లేదని, బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
వందేమాతరం’’ను బహిష్కరిస్తే చర్యలేవి?
వందేమాతరం గేయ ఆలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్, మండలి చైర్మన్, స్పీకర్, cm, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేల బహిష్కరించడం దుర్మార్గం. భారత జాతీయ గేయాన్ని, భారతమాతను అవమానించారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను మజ్లిస్ ధిక్కరించడం ఎంత వరకు కరెక్ట్? సభలో గవర్నర్, సీఎం, స్పీకర్, మండలి ఛైర్మన్ సహా సభ్యులంతా ఉన్నారు. శాసనసభలో సభ్యులు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఒక్క స్పీకర్ కు మాత్రమే ఉంది.
ఎందుకంటే స్పీకర్ శాసనసభ కస్టోడియన్. అయినా ఇంతవరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పుపట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడింది. ఈ తరుణంలో వందేమాతరం ఆలాపనను మజ్లిస్ బహిష్కరిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శాసన వ్యవస్థపట్ల, స్పీకర్ పట్ల ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. స్పీకర్ కు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల సంగతి తెలుసా? అధికారులైనా ఆయన ద్రుష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా?
నిద్రలో కూడా వందేమాతరం గుర్తుండేలా ఎంఐఎం మెడలు వంచుతాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాననసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందించలేదు? బీజేపీ అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం మెడలు పట్టి తప్పనిసరిగా వందేమాతరం ఆలపించేలా చర్యలు తీసుకునేవాళ్లం. భారతీయ పౌరులంతా వందేమాతరం ఆలపించాల్సిందే. ఎవరైతే వ్యతిరేకిస్తే వాళ్లను కటకటాల్లోకి నెట్టి భారతీయత అంటే ఏమిటి? భారతీయత గొప్పదనం ఏమిటో చూపించేవాళ్లం. దమ్మున్న పార్టీ, దమ్మున్న ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటివి చేయగలం. మజ్లిస్ మోచేతి నీళ్లు తాగే పార్టీలు అధికారంలో ఉన్నవి కాబట్టే స్పందించడం లేదు.
కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా స్పీకర్ వ్యవహరిస్తే ఎలా? శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరే చూసీచూడనట్లు ఉంటే సభ హుందాతనాన్ని కాపాడేదెవరు? ప్రజాస్వామ్యవాదులంతా మజ్లిస్ తీరును ఖండించాలి.
ఒవైసీ అప్పడప్పుడు వచ్చి దేశభక్తుడిని అని చెప్పుకోవడం కాదు. ఆచరణలో చూపాలి. అయినా ఉగ్రవాదులను తన కాలేజీలో పెట్టుకుని దేశభక్తి మాట్లాడే ఒవైసీ మాటలను నమ్మేదెవరు అన్నారు.
మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమే
మూసీ పునరుజ్జీవంపై...ఏపీలో లడ్డూ గురించి, తెలంగాణలో మూసీ గురించే చర్చ జరుగుతోంది. నేను మళ్లీ చెబుతున్నా. భారతీయ జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే బీజేపీ వ్యతిరేకం.... నిన్న సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మూసి నిర్వాసితులందరికీ ఆ ప్రాంతంలోనే ఇళ్ల కట్టించి, పునరావాస సాయం అందించి మెరుగైన ఆసుపత్రులు అక్కడే నిర్మించి, ప్రతి చోట మురుగు నీటి శుద్ది కేంద్రాలుm(ఎస్టీపీలు)ను ఏర్పాటు చేసి, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తామని చెప్పారు. నేను డిమాండ్ చేస్తెన్నా. అవన్నీ కట్టిన తరువాతే మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలి.
ఈ విషయంలో గుజరాత్ సబర్మతి నది తరహాలో ప్రక్షాళన చేయండి. ఒక్కసారి సబర్మతికి వెళ్లి స్టడీ చేయండి. అట్ల కాకుండా పేదల ఇండ్లు కూల్చి రోడ్డు పాల్జేస్తామంటే బుల్డోజర్లకు అడ్డంగా నిలుస్తాం.. అంతెందుకు పేదల ఇండ్లను కూల్చి గాంధీ విగ్రహం కడతామంటే ఆ మహాత్ముడి ఆత్మ క్షోభిస్తోంది. ఎక్కడైనా ఫలానా ప్రభుత్వం పేదలకు ఇండ్లను నిర్మించిందని చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం పేదల ఇండ్లను కూలుస్తోందనే చర్చే జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కౌంటర్...
నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తొక్కుకుంటూ సీఎం అయ్యానని చెప్పడం సిగ్గు చేటు. ఆయన మాటలు బీఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్లుగా లేవు. అసమ్మతి మీటింగ్ లు పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. కాంగ్రెస్ సీనియర్లందరి నెత్తిమీద కాలు పెట్టి తొక్కుకుంట, అసమ్మతి మీటింగ్ లు పెట్టి దించాలనుకుంటే తొక్కుకుంటా పోతానని అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా తొక్కుకుంటూ వెళ్లే రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లుంది. సర్వేలు చేయించడం మొదలు పైసలియ్యడం వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డిపైకే అప్పగించినట్లుంది. మొన్న ఢిల్లీపోయిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికలు, పైసల వ్యవహారంపైనే మాట్లాడుకుని వచ్చారు.




