రేపే బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’.. 40 కి.మీల మహా పాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు!
కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈనెల 14న (శనివారం) చేపట్టనున్న ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’కు సర్వం సిద్ధమైంది.
రేపే బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’.. 40 కి.మీల మహా పాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు!
కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈనెల 14న (శనివారం) చేపట్టనున్న ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’కు సర్వం సిద్ధమైంది. కరీంనగర్ నుండి కొండగట్టు అంజన్న క్షేత్రం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ మహా పాదయాత్ర కోసం బీజేపీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఏర్పాట్లు చేశాయి.
ఎండను లెక్కచేయక.. 8 గంటల్లో లక్ష్యం:
ప్రస్తుతం కరీంనగర్‌లో 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ, వేడిని లెక్కచేయకుండా 8 గంటల వ్యవధిలోనే కాలినడకన కొండగట్టు చేరుకోవాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. యాత్ర పొడవునా భక్తులకు, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా మజ్జిగ, తాగునీరు, పులిహోర పంపిణీ చేసేందుకు పలు భక్త మండళ్లు ముందుకు వచ్చాయి.
పరీక్షల దృష్ట్యా ట్రాఫిక్ క్రమశిక్షణ:
ప్రస్తుతం 10వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాదయాత్రను అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాలని బండి సంజయ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని సూచించారు.
యాత్ర సాగేదిలా.. (షెడ్యూల్):
ప్రారంభం: 14న ఉదయం 6:00 గంటలకు కరీంనగర్ ‘మహాశక్తి’ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాత్ర మొదలవుతుంది.
మార్గం: కొత్తపల్లి, రామడుగు, వెదిర, కురిక్యాల మీదుగా గంగాధర చేరుకుంటారు.
విరామం: గంగాధరలోని విఏఎస్ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది.
ముగింపు: మధ్యాహ్నం తర్వాత వెంకటయ్యపల్లి, పూడూరు, దొంగలమర్రి మీదుగా కొండగట్టు చేరుకుని, స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొనేందుకు కరీంనగర్ బాట పట్టడంతో ఉమ్మడి జిల్లాలో భారీ ఆధ్యాత్మిక సందడి నెలకొంది.




