Vivo: ఆ టెక్నాలజీతో రానున్న వివో కొత్త ఫోన్స్.. స్పెషల్ ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే..?
Vivo X300s Launch Date: స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో మరో పెద్ద మార్పునకు Vivo సిద్ధమవుతోంది. త్వరలో విడుదల కానున్న Vivo X300 Ultra, Vivo X300s మోడళ్లలో కొత్త ‘Blueprint Native Color’ టెక్నాలజీ అందించనుంది. ఈ ఫీచర్ ఫోటోలు, వీడియోలకు సినిమా తరహా నాణ్యతను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
Vivo: ఆ టెక్నాలజీతో రానున్న వివో కొత్త ఫోన్స్.. స్పెషల్ ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే..?
Vivo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ 'వీవో' త్వరలో తన అత్యంత పవర్ ఫుల్ వివో ఎక్స్ 300 అల్ట్రా (Vivo X300 Ultra), వివో ఎక్స్300ఎస్ (Vivo X300s) మోడళ్లను విడుదల చేయనుంది. వీటిలో ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు.
ఫోటోలు ఇక మరింత సహజంగా..
ఈ ఫోన్లలో వీవో సొంతంగా తయారు చేసిన ‘బ్లూప్రింట్ నేటివ్ కలర్ (Blueprint Native Color)’ అనే సాంకేతికతను ఇస్తున్నారు. దీనివల్ల మనం తీసే ఫోటోల్లో రంగులు, ముఖ్యంగా మనుషుల చర్మం రంగు (Skin Tone), వెలుతురు చాలా సహజంగా, నిజంగా చూస్తున్నట్లే కనిపించనుండడం గమనార్హం.
సినిమా రేంజ్ వీడియోలు..
వీడియోలు తీసుకోవడానికి ఇందులో రెండు ప్రత్యేక మోడ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫిల్మ్ స్టైల్, రెండోవది ఫిల్మ్ లుక్ అందించారు.
ఫిల్మ్ స్టైల్: ఇది సినిమాల్లో లాగా వైడ్‌స్క్రీన్ లో వీడియోలను షూట్ చేస్తుంది. చూసేటప్పుడు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఫిల్మ్ లుక్: ఇది వీడియోలకు మంచి కలర్ టోన్ ఇచ్చి, క్రియేటర్లకు ప్రొఫెషనల్ అవుట్‌పుట్ అందిస్తుంది.
పవర్ఫుల్ కెమెరాతోపాటు బ్యాటరీ..
200MP కెమెరా: ఈ రెండు ఫోన్లలోనూ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా ఉంటుంది. దీనివల్ల చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా ఫోటో తీయవచ్చు.
భారీ బ్యాటరీ: ముఖ్యంగా వివో ఎక్స్ 300ఎస్ (Vivo X300s) లో 7,100mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా కాలం పాటు వాడుకోవచ్చు.
డిస్ప్లే: 6.78 అంగుళాల పెద్ద స్క్రీన్, వేగంగా స్పందించే 144Hz రిఫ్రెష్ రేట్ ఇందులో ఉన్నాయి. అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ 2.0 టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది.
ఎప్పుడు రావొచ్చు?
ఈ ఫోన్లు మార్చి 30న తొలుత చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వంటి భారీ ఆప్షన్లతో రానున్నాయి. వీటితో పాటు వివో ప్యాడ్ 6 ప్రో (Vivo Pad 6 Pro) కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.




