Smartphone Tips: ఫోన్ నీళ్లలో పడిన వెంటనే బియ్యం డబ్బాలో పెడుతున్నారా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే చాలామంది తొలుత చేసే పని బియ్యంలో పెట్టడం లేదా వెంటనే ఆన్ చేసి చూడడం. కానీ ఇవి ఫోన్‌కు మరింత నష్టం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే డివైస్‌ను కాపాడే అవకాశం పెరుగుతుంది. అందుకే వెంటనే పాటించాల్సిన మూడు కీలక చిట్కాలను తెలుసుకోవడం అవసరం.

Venkat
Published on: 15 March 2026 9:11 PM IST
Smartphone Tips
X

Smartphone Tips: ఫోన్ నీళ్లలో పడిన వెంటనే బియ్యం డబ్బాలో పెడుతున్నారా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ అనుకోకుండా నీళ్లలో పడిపోవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అలాంటి సమయంలో చాలామంది పాత నమ్మకంతో ఫోన్‌ను బియ్యంలో పెట్టేస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా సురక్షితమైన మార్గం కాదు. ఫోన్‌లోకి వెళ్లిన తేమ స్క్రీన్, స్పీకర్లు, ఛార్జింగ్ పోర్ట్, అంతర్గత సర్క్యూట్లపై ప్రభావం చూపవచ్చు. అందుకే తొందరపాటుతో తప్పు చేయకుండా, కొన్ని సరైన జాగ్రత్తలు పాటిస్తే నష్టం తగ్గించుకోవచ్చు.

మొదటి పని.. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి..

ఫోన్ నీటిలో పడిన వెంటనే వీలైనంత త్వరగా దాన్ని బయటకు తీయాలి. ఎక్కువసేపు నీళ్లలో ఉంటే అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. బయటకు తీసిన వెంటనే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. చాలామంది పని చేస్తుందా లేదా అని వెంటనే ఆన్ చేసి చూసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇదే పెద్ద తప్పు. తేమ ఉన్న సమయంలో ఫోన్ ఆన్ చేస్తే సర్క్యూట్ షార్ట్ అయ్యే అవకాశముంది. దీంతో ఫోన్ పూర్తిగా పనిచేయకుండా పోవచ్చు.

ఫోన్‌ను బయటకు తీయగానే ముందుగా దానికి ఉన్న కవర్ తీసేయాలి. అలాగే చార్జింగ్ కేబుల్, ఇయర్‌ఫోన్స్ లేదా ఇతర కనెక్టెడ్ యాక్సెసరీస్ ఉంటే వెంటనే తొలగించాలి. ఇలా చేయడం వల్ల తేమ మరింత లోపలికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. ఫోన్‌లో తీసేయగలిగే బ్యాటరీ ఉంటే దాన్ని కూడా తీసేయడం మంచిది. అదేవిధంగా సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌లను కూడా బయటకు తీసి విడిగా ఆరబెట్టాలి.

మృదువైన గుడ్డతో తుడిచి, గాలి తగిలేలా ఉంచాలి..

ఫోన్‌ను మృదువైన, పొడి గుడ్డతో జాగ్రత్తగా తుడవాలి. ముఖ్యంగా ఛార్జింగ్ పోర్ట్, సిమ్ స్లాట్, స్పీకర్ ప్రాంతాల్లోని తేమను వీలైనంత వరకు తొలగించాలి. తర్వాత ఫోన్‌ను ఛార్జింగ్ పోర్ట్ కిందికి వచ్చేలా నిలువుగా ఉంచితే లోపల ఉన్న నీరు బయటికి కారే అవకాశం ఉంటుంది. కింద భాగంలో టిష్యూ లేదా పొడి గుడ్డ ఉంచితే మంచిది. ఫోన్ త్వరగా ఆరాలంటే గాలి సరిగా తగలడం ముఖ్యం. అందుకే ఫ్యాన్ దగ్గర ఉంచాలి. అయితే హెయిర్ డ్రైయర్ వంటి అధిక వేడి పరికరాలు ఉపయోగించడం మాత్రం ప్రమాదకరం.

ఇలా చేస్తే మరింత ప్రమాదం..

నీళ్లలో పడిన ఫోన్‌ను బియ్యంలో పెట్టడం, వెంటనే ఛార్జ్‌కు పెట్టడం, మళ్లీ మళ్లీ ఆన్ చేయడం వంటి చర్యలు సమస్యను పెంచవచ్చు. సరైన పద్ధతిలో ఫోన్‌ను ఆరబెట్టి, అవసరమైతే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Venkat

Venkat

Next Story