Realme P4 Lite 5G: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారంతే..?

Realme P4 Lite 5G: టెక్నాలజీ ప్రపంచంలోకి రియల్‌మీ 7000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. కాగా, కెమెరా విషయంలో 13ఎంపీ రియర్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వగా.. 15W ఛార్జింగ్ తో రావడం కొంత మందికి మైనస్‌గా భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 25 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.

Venkata Chari
Published on: 20 March 2026 10:32 AM IST
Realme P4 Lite 5G
X

Realme P4 Lite 5G: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారంతే..?

Realme P4 Lite 5G: రియల్‌మీ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ పీ4 లైట్ 5జీ (P4 Lite 5G) ను విడుదల చేసింది. ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్, భారీ 7000mAh బ్యాటరీతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆఫర్లతో దీని ప్రారంభ ధర రూ. 11,499గా ఉండటం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి?

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పనితీరులో మంచి అనుభవాన్ని ఇస్తుంది. 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ/128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

కెమెరా విషయంలో 13ఎంపీ రియర్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించగా, 15W ఛార్జింగ్ ఇవ్వడం కొంత మందికి మైనస్‌గా భావించవచ్చు.

ధరలు, ఆఫర్లు..

4GB+64GB: రూ.12,999 → ఆఫర్ తర్వాత రూ.11,499

4GB+128GB: రూ.13,999 → రూ.12,499

6GB+128GB: రూ.15,999 → రూ.14,499

ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 25 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.

Venkata Chari

Venkata Chari

Next Story