Jio: జియో యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఎయిర్‌టెల్, Vi కి షాక్!

రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో రూ.1,234 కే అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం జియో భారత్ (Jio Bharat) ఫోన్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్, Vi ప్లాన్‌లతో దీని పోలికను ఇక్కడ చూడండి.

Ganesh
Updated on: 23 March 2026 6:11 PM IST
Jio
X

Jio: జియో యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఎయిర్‌టెల్, Vi కి షాక్!

Jio: జియో యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఎయిర్‌టెల్, Vi కి షాక్!రూ.1,234 కే ఏడాదికి పైగా వ్యాలిడిటీ.. #336 రోజులు సేవలు అందించే ప్లాన్..

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్స్ కోసం మరో సంచలన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం కేవలం రూ.1,234 ధరకే దాదాపు ఏడాది పొడవునా (336 రోజులు) సేవలు అందించేలా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ప్లాన్ వివరాలు, ప్రయోజనాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జియో రూ.1,234 ప్లాన్ విశేషాలు..

ఈ రీఛార్జ్ ప్లాన్ ముఖ్యంగా డేటా కంటే ఎక్కువ వ్యాలిడిటీ, కాలింగ్ అవసరమైన వారిని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా మీకు ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజూ 0.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం ప్లాన్ వ్యాలిడిటీ కలిపి 168GB డేటా అందుబాటులో ఉంటుంది. డైలీ కోటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, ప్రతి 28 రోజులకు 300 SMSలు ఉచితంగా లభిస్తాయి. దీని అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. జియో సావన్, జియో టీవీ యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

అయితే, ఈ ప్లాన్ విషయంలో ఒక చిన్న షరతు ఉంది. ఈ రూ.1,234 ఆఫర్ కేవలం జియో భారత్ ఫోన్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ప్లాన్‌ను పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు. తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ వాడుతూ, లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే గ్రామీణ, పట్టణ వినియోగదారులకు ఇది వరం లాంటిదని చెప్పవచ్చు.

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) పరిస్థితి ఏంటి..

ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ లేదా వోడాఫోన్ ఐడియా సంస్థలు రూ.1,300 లోపు ధరలో ఇంత ఎక్కువ వ్యాలిడిటీ (336 రోజులు) ఇచ్చే ప్లాన్‌లను ఏవీ ఆఫర్ చేయడం లేదు. జియో తన సొంత బ్రాండ్ ఫోన్ల ద్వారా తక్కువ ధరకే సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తూ పోటీలో ముందంజలో నిలిచిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Ganesh

Ganesh

Next Story