Instagram: ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. మే8 నుంచి అలా చేస్తే చిక్కుల్లో పడ్డట్లే..?
Instagram DM Privacy: ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసే కోట్లాది మంది యూజర్లకు కీలక హెచ్చరిక వెలువడింది. 2026 మే 8 తర్వాత డైరెక్ట్ మెసేజెస్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ నిలిపివేయనున్నట్టు సమాచారం. దీంతో వ్యక్తిగత చాట్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Instagram: ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. మే8 నుంచి అలా చేస్తే చిక్కుల్లో పడ్డట్లే..?
Instagram: Instagram Privacy Update: మెటాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్, తన డైరెక్ట్ మెసేజెస్ (DMs) సేవలో కీలక మార్పు తీసుకురానుంది. ఇప్పటివరకు కొందరు యూజర్లకు అందుబాటులో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) సపోర్ట్‌ను 2026 మే 8 తర్వాత నిలిపివేయనుంది. ఈ ఫీచర్ వల్ల ఇద్దరు యూజర్ల మధ్య జరిగే సంభాషణలను ఎవరూ, కంపెనీ సైతం, నేరుగా చదవలేదు. కానీ, ఈ సపోర్ట్ తొలగింపుతో ప్రైవసీపై సందేహాలు పెరిగే అవకాశం ఉంది.
E2EE తొలగింపుతో ఏం జరుగుతుంది?
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకుండా పోతే, చాట్‌ల భద్రత పూర్వం లాగే ఉండకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, సున్నితమైన సమాచారం, ఫోటోలు, పాస్‌వర్డ్లు వంటి అంశాలను షేర్ చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ మార్పు అమల్లోకి రాకముందే యూజర్లకు తమ మెసేజ్లు లేదా మీడియాను డౌన్‌లోడ్ చేసుకునే మార్గదర్శకాలు చూపించనుంది. పాత వెర్షన్ యాప్ వాడుతున్నవారు తమ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్లు యాక్సెస్ చేసుకోవాలంటే యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఫీచర్‌ను తక్కువ మంది మాత్రమే వాడారా?
ఈ ఫీచర్‌ను ఎందుకు నిలిపివేస్తున్నారనే అంశంపై ఇన్‌స్టాగ్రామ్ సపోర్ట్ పేజీలో స్పష్టమైన కారణం వెల్లడించలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం, DMలలో E2EE వినియోగం చాలా పరిమిత స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను కొనసాగించాలని భావించే యూజర్లు వాట్సాప్ వంటి వేదికలను ఉపయోగించవచ్చని సూచనలు వచ్చినట్లు సమాచారం.
అందరికీ ఈ ఫీచర్ అందుబాటులో లేదు..
ఇన్‌స్టాగ్రామ్‌లో E2EE ఫీచర్ అన్ని ప్రాంతాల్లో, అందరికీ అందుబాటులో లేదు. ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ‘ఆప్ట్-ఇన్’ విధానంలో అందించనుంది. అంటే ఆసక్తి ఉన్న యూజర్లు మాత్రమే దీనిని యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండేది. మెటా గతంలో కూడా ఎన్‌క్రిప్షన్ విషయంలో పలుమార్లు విధాన మార్పులు చేసింది. వాట్సాప్‌లో 2016లో పూర్తి ఎన్‌క్రిప్షన్ ప్రారంభించిన తర్వాత, ఇతర సేవల్లో కూడా దశలవారీగా మార్పులు చేపట్టింది.
ఇకపై చాటింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు..
మే 8 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తుంటే, బ్యాంక్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్లు, ఆధార్ వంటి సున్నితమైన డేటాను అసలు షేర్ చేయకూడదు. అవసరమైతే కోడ్ పదాలను ఉపయోగించడం మంచిది. అలాగే వానిష్ మోడ్ వాడితే, మెసేజ్లు చదివిన తర్వాత, చాట్ మూసిన వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. చాలా ముఖ్యమైన ఫోటోలు లేదా డాక్యుమెంట్లు పంపాల్సి వస్తే ‘View Once’ ఫీచర్ వినియోగించడం కొంతవరకు భద్రత కల్పిస్తుంది.




