Google Pixel: గూగుల్ పిక్సెల్ 11 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Google Pixel 11 Pro: స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మరో పెద్ద సంచలనానికి గూగుల్ సిద్ధమతోంది. తన కొత్త పిక్సెల్ 11వ సిరీస్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

Venkat
Published on: 23 March 2026 9:38 PM IST
Google Pixel
X

Google Pixel: గూగుల్ పిక్సెల్ 11 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Google Pixel 11 Pro: స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మరో పెద్ద సంచలనానికి గూగుల్ సిద్ధమతోంది. తన కొత్త పిక్సెల్ 11వ సిరీస్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు లీకైన వివరాల మేరకు ఇందులో వినూత్న ఫీచర్లు ఎన్నో ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి అంశాల్లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉందని సమాచారం.

స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ పట్ల అప్పుడే ఆసక్తి మొదలైంది. అత్యాధునిక సాంకేతికత, పవర్ ఫుల్ ప్రాసెసర్, మెరుగైన కెమెరా సామర్థ్యాలతో ఈ ఫోన్ రాబోతోంది. ముఖ్యంగా ప్రో మోడల్స్‌లో అధిక రిఫ్రెష్ రేట్ ఉండవచ్చనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఓసారి చూద్దాం.

గూగుల్ పిక్సెల్ 11: టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం..

ప్రముఖ అగ్రశ్రేణి సంస్థ గూగుల్, 2026 నాటికి తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ వంటి నాలుగు మోడళ్లను సంస్థ పరిచయం చేయనుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గూగుల్ ఈసారి మరిన్ని వినూత్న మార్పులను చేసినట్లు తెలుస్తోంది.

అద్భుతమైన డిస్‌ప్లే, పనితీరు..

లీక్ అయిన సమాచారం ప్రకారం, పిక్సెల్ 11 మోడల్‌లో 6.6 అంగుళాల అమోలెడ్ తెర ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండగా, ప్రో మోడల్స్‌లో మాత్రం ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే అవకాశం ఉంది. దీనివల్ల గేమింగ్, వీడియోలు చూసేందుకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక పనితీరు విషయానికి వస్తే, ఇందులో సరికొత్త టెన్సర్ G6 చిప్‌సెట్‌ను వాడనున్నారు. ఇది 2 నానోమీటర్ సాంకేతికతతో తయారవుతోంది. దీనివల్ల ఫోన్ వేడెక్కడం తగ్గుతుంది, వేగం పెరుగుతుంది.

బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ విశేషాలు..

పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లలో 5,500mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చనున్నారు. ఇది 45W నుంచి 65W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 17 వెర్షన్‌తో పనిచేసే అవకాశం ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీ సామర్థ్యంతో ఈ ఫోన్లు శక్తివంతమైన పనితీరును కనబరుస్తాయి.

కెమెరా విభాగం..

కెమెరా నాణ్యతకు పెట్టింది పేరు గూగుల్ పిక్సెల్. ఈ కొత్త సిరీస్‌లో మూడు కెమెరాల అమరిక ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫోటోలను మరింత స్పష్టంగా, సహజంగా చిత్రీకరించడానికి తోడ్పడుతుంది.

ధర, విడుదల తేదీ..

భారత మార్కెట్లో పిక్సెల్ 11 ప్రారంభ ధర సుమారు రూ. 79,990 నుంచి రూ. 85,000 మధ్య ఉండవచ్చు. ప్రో మోడల్ ధర రూ. 1,11,999, ప్రో ఎక్స్‌ఎల్ ధర రూ. 1,19,999 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ల విడుదల 2026 ఆగస్టు నెలలో ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Venkat

Venkat

Next Story