Umpire Salary: ఇంటర్నేషనల్ టు ఐపీఎల్ మ్యాచ్‌లు.. అంపైర్ల పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!
Umpire Salary: అంపైర్లకు ఎంత జీతం ఇస్తారో చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి దేశీయ పోటీలు, ఐపీఎల్ వరకు అంపైర్ల పారితోషికం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
Umpire Salary: ఇంటర్నేషనల్ టు ఐపీఎల్ మ్యాచ్‌లు.. అంపైర్ల పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!
Umpire Salary: క్రికెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్‌ను నిష్పక్షపాతంగా నడిపించే బాధ్యత వాళ్లపై ఉంటుంది. వైడ్, నోబ్, బౌండరీస్, ఎల్బీలతో పాటు బంతులను సరిగ్గా లెక్కించాల్సి ఉంటుంది. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా మైదానములో ఉండాల్సి ఉంటుంది. అయితే ఇంతలా కష్టపడే అంపైర్లకు ఎంత జీతం ఇస్తారో చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి దేశీయ పోటీలు, ఐపీఎల్ వరకు అంపైర్ల పారితోషికం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల విషయానికి వస్తే… టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్లకు సుమారు రూ.4 లక్షలను ఐసీసీ చెల్లిస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వన్డే మ్యాచ్‌కు రూ.2.5 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.1.25 లక్షలు పారితోషికంగా అందుతుంది. మ్యాచ్ ఫార్మాట్ ఆధారంగా అంపైర్ల జీతం మారుతూ ఉంటుంది.
దేశీయ (డొమెస్టిక్) మ్యాచ్‌లలో కూడా అంపైర్లకు మంచి పారితోషికమే ఉంటుంది. గ్రేడ్ A+, A కేటగిరీ అంపైర్లకు సుమారు రూ.1.6 లక్షల సాలరీ అందుతుంది. గ్రేడ్ B, C అంపైర్లకు రూ.1.2 లక్షలు చెల్లిస్తారు. నాకౌట్ మ్యాచ్‌లకు అయితే రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పారితోషికం ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అంపైర్లకు మరింత ఎక్కువ పారితోషికం ఉంటుంది. మైదానంలో మ్యాచ్ నిర్వహించే ఆన్‌ఫీల్డ్ అంపైర్లకు ఒక్క మ్యాచ్‌కు సుమారు రూ.3 లక్షలు అందుతుంది. ఫోర్త్ అంపైర్‌కు రూ.2 లక్షలు చెల్లిస్తారు.
మొత్తంగా చూస్తే అంపైర్ల బాధ్యతలు ఎంత కీలకమో, వారి జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ్యాచ్ న్యాయంగా జరగాలంటే అంపైర్ల పాత్ర ఎంత ముఖ్యమో ఈ పారితోషికాలే చెబుతున్నాయి. మ్యాచ్‌లలో ఆటగాళ్లతో పాటు అంపైర్లకు గాయాలు అవుతుంటాయి. ముఖ్యంగా స్ట్రయిట్ ఫీల్డ్ అంపైర్కు. బ్యాటర్ స్ట్రయిట్ షాట్ ఆడినప్పుడు గాయాలు అవుతుంటాయి. అందుకే ప్రతి బంతికి అప్రమత్తంగా ఉండాల్సిందే.




