SRH Mistake: మ్యాచ్ విన్నర్‌ను వదిలేసిన ఎస్ఆర్‌హెచ్.. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం చేసిందా?

SRH Mistake
x

SRH Mistake: మ్యాచ్ విన్నర్‌ను వదిలేసిన ఎస్ఆర్‌హెచ్.. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం చేసిందా?

Highlights

SRH Big Mistake: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ప్రాంచైజీల నిర్ణయాలు కొన్నిసార్లు భారీ ఎత్తున చర్చలకు దారితీస్తుంటాయి.

SRH Mistake: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ప్రాంచైజీల నిర్ణయాలు కొన్నిసార్లు భారీ ఎత్తున చర్చలకు దారితీస్తుంటాయి. అలాంటి ఒక నిర్ణయం ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)పై విమర్శలకు కారణమవుతోంది. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తక్కువ ధరకు కొనుగోలు చేసి, తర్వాత వదిలేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎస్ఆర్‌హెచ్ పెద్ద తప్పిదం చేసిందా? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్‌లో ఓ ప్రాంచైజీ వదిలేసిన ప్లేయర్.. మరో ప్రాంచైజీకి వెళ్లి అదరగొడుతుంటారు. అందులోనూ తనను వదిలేసిన జట్లపై అద్భుత ప్రదర్శన చేస్తుంటారు. ఈ జాబితాలో మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ కేవలం రూ.6.25 కోట్లకే షమీని సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో జట్టుకు ప్రధాన బౌలర్‌గా నిలిచి.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ మంచి ప్రదర్శన ఇచ్చాడు. తన అనుభవంతో జట్టుకు బలంగా నిలిచాడు. అయితే కొన్ని మ్యాచ్‌లలో భారీగా పరుగులు కూడా ఇచ్చాడు. ఎస్ఆర్‌హెచ్ ఆశించిన స్థాయిలో షమీ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.

అయితే ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మహ్మద్ షమీని ఎస్ఆర్‌హెచ్ వేదిలేసింది. వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.10 కోట్లకు తీసుకుంది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదే ఫామ్ ఐపీఎల్‌లో కొనసాగిస్తున్నాడు. లక్నో తరఫున ఆడుతున్న షమీ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. ఎస్ఆర్‌హెచ్ మ్యాచులో మొత్తంగా 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

మహ్మద్ షమీ బౌలింగ్ కారణంగా ఎస్ఆర్‌హెచ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. లక్షాన్ని లక్నో సునాయాసంగా ఛేదించింది. లక్నో మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అభిమానులు ఎస్ఆర్‌హెచ్ నిర్ణయంపై కామెంట్స్ చేస్తున్నారు. 'ఇలాంటి బౌలర్‌ను ఎలా వదిలేస్తారు?', 'ఇది ఎస్ఆర్‌హెచ్ చరిత్రలోనే పెద్ద తప్పిదం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. షమీని కొనసాగించకపోవడం జట్టుకు నష్టమని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 మిగతా మ్యాచ్‌ల్లో షమీ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. ఎస్ఆర్‌హెచ్ నిర్ణయం మరింతగా విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామం ఐపీఎల్ ట్రేడింగ్, రిటెన్షన్ నిర్ణయాలపై మరోసారి చర్చకు దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories