Robin Uthappa: అదృష్టం కలిసొచ్చింది, ఇప్పుడంత సులువు కాదు.. వైభవ్ సూర్యవంశీపై ఉతప్ప సంచలన వ్యాఖ్యలు!
Robin Uthappa: భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది కాలంగా వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ను తాను గమనిస్తున్నానని, అతను ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడని ప్రశంసించాడు. అయితే అతని ఆటలో కొంతవరకు అదృష్టం కూడా కలిసి వస్తోందని వ్యాఖ్యానించాడు.
Robin Uthappa: భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది కాలంగా వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ను తాను గమనిస్తున్నానని, అతను ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడని ప్రశంసించాడు. అయితే అతని ఆటలో కొంతవరకు అదృష్టం కూడా కలిసి వస్తోందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026లో వైభవ్‌కు అంత సులువు కాదని హెచ్చరించాడు. వైభవ్ బ్యాటింగ్ స్టైల్, అతని వీక్ పాయింట్స్ ఇప్పుడు బౌలర్లకు తెలిసిపోయాయని ఉతప్ప చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 మార్చి 28న ఆరంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఉతప్ప అతడి ప్రదర్శనపై స్పందించాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ... 'గత 12 నెలలుగా వైభవ్ సూర్యవంశీ ఆటను దగ్గర నుంచి పరిశీలిస్తున్నా. అతను నిజంగా అద్భుతమైన ఆటగాడు. కానీ ప్రస్తుతం కొంతవరకు అదృష్టం కూడా అతనికి తోడైంది. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లు అతని బలహీనతలను పూర్తిగా అర్థం చేసుకోలేదు. క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వైభవ్ అసలైన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చినప్పుడు బౌలర్లకు టెక్నిక్ గురించి పెద్దగా అవగాహన ఉండదు కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. బౌలర్లు ఇప్పుడు వైభవ్‌కు ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలిసిపోయింది. ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో బౌలర్లకు ఒక ఐడియా వచ్చేసింది. కాబట్టి భవిష్యత్తులో అతనికి మరింత కఠినమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది' అని అన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్‌కు మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఈ సీజన్ అతనికి పాఠాలు నేర్పుతుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన ఆటగాడిగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. సుదీర్ఘకాలం కొనసాగేందుకు బలంగా అడుగులు వేయాల్సిన తరుణం ఇదే. ఈసారి కూడా వైభవ్ పరుగులు చేస్తాడు. కానీ గత ఏడాది చూపిన స్థాయిలో ప్రదర్శన చేయడం కష్టమే. ప్రత్యర్థుల నుంచి అతన్ని ముప్పు తప్పదు' అని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ ఓ సంచలనంగా. కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ అతడిని ఐపీఎల్ 2025 కోసం రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది.. ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 252 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2026 కోసం ఇప్పటికే సిద్దమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.




