RCB-Yash Dayal: ఫోన్ స్విచ్ఛాఫ్, ఫోటో లేదు.. స్టార్ పేసర్ యశ్ దయాల్‌పై ఆర్‌సీబీ వేటు?

ఆర్‌సీబీ జట్టు ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించగా.. భారత ఆటగాళ్లతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా హాజరయ్యాడు. అయితే స్టార్ పేసర్ యశ్ దయాల్‌ గైర్హాజరు కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 21 March 2026 3:51 PM IST
RCB-Yash Dayal
X

RCB-Yash Dayal: ఫోన్ స్విచ్ఛాఫ్, ఫోటో లేదు.. స్టార్ పేసర్ యశ్ దయాల్‌పై ఆర్‌సీబీ వేటు?

RCB-Yash Dayal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో తలపడనుంది. ఇప్పటికే ఆర్‌సీబీ జట్టు ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించగా.. భారత ఆటగాళ్లతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా హాజరయ్యాడు. అయితే ఆశ్చర్యకరంగా స్టార్ పేసర్ యశ్ దయాల్‌ గైర్హాజరు కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఆర్‌సీబీ ప్రాక్టీస్ సెషన్‌లో మాత్రమే కాదు.. జట్టు బస్‌పై ఉన్న గ్రాఫిటీలో కూడా యశ్ దయాల్ ఫోటో లేదు. ఇది ఆర్‌సీబీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దయాల్‌పై ఆర్‌సీబీ యాజమాన్యం వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. యశ్ దయాల్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2026కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. దయాల్ ఇంకా ఆర్‌సీబీ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొనలేదు.

యశ్ దయాల్ చివరిసారిగా ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత అతనిపై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువతులు దయాల్‌పై ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై ఐదేళ్లుగా అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదైన కొద్ది రోజులకే మరో అమ్మాయి కూడా తనను అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆ యువతి వయసు 17 ఏళ్లే కావడంతో.. దయాల్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల కారణంగా అతన్ని ఉత్తరప్రదేశ్ జట్టుకు దూరం పెట్టింది. ఆపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అతని కోచ్ కూడా అతడిని సంప్రదించలేకపోయారట. దయాల్‌ తన ఫోన్ నంబర్ కూడా మార్చినట్లు సమాచారం.

అత్యాచారం కేసులో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలైన యశ్ దయాల్ ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 4న నోయిడాలో శ్వేత పుండీర్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇరి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అతడి పెళ్లికి క్రికెటర్లు ఎవ్వరూ హాజరుకాలేదు. దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవాలని ఆర్‌సీబీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో దయాల్ 13 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024లో దయాల్‌ను ఆర్‌సీబీ రూ.3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా.. 15 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.5 కోట్లకు రిటైన్ చేసుకోగా.. జట్టుకు టైటిల్ అందించాడు. ఇపుడు అతడు ఆడడం అనుమానంగా మారింది.

Rishvik

Rishvik

Next Story