RCB Playing 11: బెంబేలెత్తించే ప్లేయర్స్, అందరూ మ్యాచ్ విన్నర్లే.. ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు బలమైన కాంబినేషన్‌తో సిద్ధమవుతోంది.

Rishvik
Published on: 24 March 2026 4:31 PM IST
RCB Playing 11
X

RCB Playing 11: బెంబేలెత్తించే ప్లేయర్స్, అందరూ మ్యాచ్ విన్నర్లే.. ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 ఇదే!

RCB Playing 11:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు బలమైన కాంబినేషన్‌తో సిద్ధమవుతోంది. గత సీజన్‌లో టైటిల్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఆర్‌సీబీ.. ఈసారి కూడా ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాజత్ పటిదార్ నాయకత్వంలో పటిష్ట జట్టు, స్పష్టమైన పాత్రలతో ఈసారి మరింత బలంగా కనిపిస్తోంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు ఆర్‌సీబీ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సన్‌రైజర్స్ మ్యాచ్ కోసం బెంగళూరు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.

గతంలో స్టార్ ఆటగాళ్లపై ఆధారపడిన ఆర్‌సీబీ.. ఇప్పుడు రోల్-బేస్డ్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వనున్నారు. కోహ్లీ ఇన్నింగ్స్‌ను నడిపిస్తే.. సాల్ట్ దూకుడైన బ్యాటింగ్‌తో పవర్‌ప్లేలోనే ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచనున్నాడు. మూడో స్థానంలో కెప్టెన్ రజత్ పటిదార్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడనుండగా.. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఫినిషర్లుగా జట్టుకు ప్రధాన బలం కానున్నారు. ఆల్‌రౌండర్లుగా కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్ జట్టుకు సమతుల్యత తీసుకువస్తున్నారు.

బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చేరిక ఆర్‌సీబీకి పెద్ద బూస్ట్ కానుంది. అతనికి జాకబ్ డఫీ (హాజిల్‌వుడ్ స్థానంలో), మంగేశ్ యాదవ్ మద్దతు ఇవ్వనున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నియంత్రణ కలిగిన బౌలింగ్ ఈసారి ఆర్‌సీబీకి కీలకంగా మారనుంది. హత్యాచార కేసులో ఇరుకున్న యశ్ దయాల్ ఆడడంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. జోష్ హాజిల్‌వుడ్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం కూడా ఆర్‌సీబీకి పెద్ద ప్లస్ కానుంది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై సుయాష్ శర్మను ఆడించవచ్చు. అలాగే మ్యాచ్ పరిస్థితుల ఆధారంగా వెంకటేశ్ అయ్యర్‌ను బ్యాటింగ్ విభాగంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే ఆర్‌సీబీ ప్లేయింగ్ 11లో అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. ఆర్‌సీబీ ఇప్పుడు కేవలం టైటిల్ కోసం పోరాడే జట్టు కాదు.. టైటిల్‌ను కాపాడుకునే స్థాయికి చేరుకుంది. పటిష్ట జట్టు, స్పష్టమైన వ్యూహాలు, ప్రతి ఆటగాడికి నిర్దిష్ట పాత్రలు ఉండటం ఆర్‌సీబీని మరింత బలంగా మార్చాయి. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ మరోసారి ట్రోఫీని గెలిచి విజేతల పరంపరను కొనసాగిస్తుందా లేదా అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 (అంచనా):

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, మంగేశ్ యాదవ్, జాకబ్ డఫీ.

ఇంపాక్ట్ ప్లేయర్:

సుయాష్ శర్మ, వెంకటేశ్ అయ్యర్‌.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story