LSG Dance: లక్నో ప్లేయర్ల డ్యాన్స్ అదుర్స్.. వీడియో చూడాల్సిందే!

LSG Dance
x

LSG Dance: లక్నో ప్లేయర్ల డ్యాన్స్ అదుర్స్.. వీడియో చూడాల్సిందే!

Highlights

LSG Dance: ఐపీఎల్ 2026 సీజన్‌లోఎల్ఎస్‌జీ తమ తొలి విజయాన్ని నమోదు చేసిన తర్వాత జట్టులో ఉత్సాహం నెలకొంది.

LSG Dance: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) బోణి కొట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన అనంతరం ఎల్ఎస్‌జీపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్‌పై తీవ్ర ఒత్తిడి పడింది. అయితే రెండో మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 రన్స్ చేసింది. ఛేదనలో లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఐపీఎల్ 2026 సీజన్‌లోఎల్ఎస్‌జీ తమ తొలి విజయాన్ని నమోదు చేసిన తర్వాత జట్టులో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఈ కెప్టెన్ రిషబ్ పంత్‌ విజయాన్ని తెగ ఎంజాయ్ చేశాడు. పంత్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఒక ఫన్నీ ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాలీవుడ్ చిత్రం 'కోయి మిల్‌గయా'లోని పాటకు ఎల్ఎస్‌జీ ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు. మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్ కలిసి సరదాగా స్టెప్పులు వేస్తున్నట్లు రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

మహమ్మద్ షమీ చేసిన డ్యాన్స్ ఏఐ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. అతని ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులు చూసి అభిమానులు నవ్వులు పూయిస్తున్నారు. రిషబ్ పంత్ స్టెప్స్ కూడా బాగున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోపై కామెంట్స్, షేర్ల వర్షం కురుస్తోంది. జట్టు తొలి విజయం తర్వాత ఇలాంటి సరదా క్షణాలను పంచుకోవడం ద్వారా ఆటగాళ్లు, అభిమానుల మధ్య బంధం మరింత బలపడనుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతూ.. ఎల్ఎస్‌జీ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. సన్‌రైజర్స్ విజయంతో ఎల్ఎస్‌జీ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందని, ఇకపై ఇదే జోష్ కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏప్రిల్ 9న కోల్‌కతాతో లక్నో మ్యాచ్ ఆడనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories