IPL 2026: వయస్సు కేవలం సంఖ్య మాత్రమే.. ఆ వయసులో కూడా ఐపీఎల్‌లో ఆడిన లెజెండ్స్ లిస్ట్ ఇదే!

IPL 2026, Oldest Players List: యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతుంటారు. 40 ఏళ్లు దాటాక కూడా ఐపీఎల్‌లో చాలామంది క్రికెటర్లు ఆడారు. ప్రతి జట్టులో అత్యధిక వయస్సులో ఆడిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Rishvik
Published on: 17 March 2026 9:27 PM IST
IPL 2026 Oldest Players List
X

IPL 2026: వయస్సు కేవలం సంఖ్య మాత్రమే.. ఆ వయసులో కూడా ఐపీఎల్‌లో ఆడిన లెజెండ్స్ లిస్ట్ ఇదే!

IPL 2026, Oldest Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతుంటారు. వయస్సు పెరిగినా ఆటపై పట్టు తగ్గదని, అనుభవం ఎంత కీలకమో నిరూపించిన సీనియర్ క్రికెటర్లు చాలామంది ఉన్నారు. 40 ఏళ్లు దాటాక కూడా ఐపీఎల్‌లో చాలామంది క్రికెటర్లు ఆడారు. ప్రతి జట్టులో అత్యధిక వయస్సులో ఆడిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అగ్రస్థానంలో బ్రాడ్ హగ్:

కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు బ్రాడ్ హగ్ 45 సంవత్సరాలు 92 రోజుల వయస్సులో ఆడి రికార్డు సృష్టించాడు. బ్రాడ్ హగ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 43 సంవత్సరాలు 322 రోజులతో ఈ జాబితాలో నిలిచాడు. మహీ సీఎస్కేకు కీలకంగా ఉండటం విశేషం. ఐపీఎల్ 2026లో ధోనీ ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ప్రవీణ్ తాంబే 43 సంవత్సరాలు 214 రోజుల్లో ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 42 సంవత్సరాలు 35 రోజుల్లో ప్రాతినిధ్యం వహించాడు.

పంజాబ్ తరఫున క్రిస్ గేల్:

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ 42 సంవత్సరాలు 7 రోజుల వయస్సులో ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 41 సంవత్సరాలు 155 రోజుల్లో మైదానంలో కనిపించాడు. డిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున ఫాఫ్ డుప్లెసిస్ 40 సంవత్సరాలు 315 రోజుల్లో ఆడగా.. ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున శ్రీలంక మాజీ బ్యాటర్ సనత్ జయసూర్య 40 సంవత్సరాలు 285 రోజుల్లో ఆడాడు.

ఎస్ఆర్‌హెచ్ తరఫున ఆశిష్ నెహ్రా:

గుజరాత్ టైటాన్స్ (జీటీ)కి భారత వెటరన్ కీపర్ వృద్ధిమాన్ సాహా 39 సంవత్సరాలు 193 రోజుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తరఫున భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా 38 సంవత్సరాలు 7 రోజుల వయస్సులో ఆడాడు. మొత్తంగా చూస్తే.. ఐపీఎల్ కేవలం యువ ఆటగాళ్లకే కాదు, అనుభవజ్ఞులకూ పెద్ద వేదికగా నిలుస్తోంది. ఈ సీనియర్ క్రికెటర్లు తమ అనుభవంతో జట్లకు కీలకంగా మారి, యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని ఈ లెజెండ్స్ మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు.

Rishvik

Rishvik

Next Story