Team India: వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు.. 20 మంది ఆటగాళ్లు ఫిక్స్..?

ODI World Cup 2027 India: ఐపీఎల్ 2026 కేవలం లీగ్ మాత్రమే కాదు.. భారత క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికగా మారింది. 2027

Venkat
Published on: 20 March 2026 8:42 PM IST
Team India
X

Team India: వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు.. 20 మంది ఆటగాళ్లు ఫిక్స్..?

ODI World Cup 2027 India: ఐపీఎల్ 2026 కేవలం లీగ్ మాత్రమే కాదు.. భారత క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికగా మారింది. 2027 వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక కావాలంటే ఈ సీజన్‌లో ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఇప్పటికే 20 మంది షార్ట్‌లిస్ట్ చేసిన నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టి అంతా ఐపీఎల్‌పైనే ఉంది.

India squad selection: ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 2026 అనేక మంది యువ ఆటగాళ్ల లైఫ్ మారనుంది. బీసీసీఐ ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని 20 మంది ప్రాబబుల్ ప్లేయర్లను ఎంపిక చేసిందంట. ఈ ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి తుది జట్టును నిర్ణయించే అవకాశం ఉంది. మార్చి 28న ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో ప్రతి మ్యాచ్ సెలెక్టర్లకు ఒక పరీక్షలా మారనుంది. అద్భుత ప్రదర్శనతో ఆటగాళ్లు జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవచ్చు.

సెలెక్టర్ల దృష్టి ఐపీఎల్‌పైనే..

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓఝా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా, అలాగే టీవీ ద్వారా పరిశీలించనున్నారు. ప్రతి సెలెక్టర్ వారానికి కనీసం ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో మొత్తం ఐదు మ్యాచ్‌లు ప్రతీ వారం సమీక్షలోకి వస్తాయి.

ప్రపంచకప్ 2027 ప్రణాళిక..

2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ - నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో జట్టును ముందుగానే సిద్ధం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, సీనియర్ల స్థానాలను భర్తీ చేయడం ఈ ప్రణాళికలో భాగంగా కనిపిస్తోంది.

అగార్కర్ భవిష్యత్తుపై స్పష్టత..

సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని కోరలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన కాంట్రాక్ట్ సెప్టెంబర్ వరకు ఉంది. ఆ తర్వాత కొనసాగాలా వద్దా అన్నది బీసీసీఐతో కలిసి నిర్ణయించనున్నారు. సీనియర్ సెలెక్టర్లు నాలుగేళ్ల వరకు కొనసాగవచ్చని, ప్రత్యేకంగా పొడిగింపు కోరాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

ఇతర మ్యాచ్‌లపై కూడా ఫోకస్..

ఐపీఎల్‌తో పాటు జూన్ 6 నుంచి 10 వరకు ముల్లన్‌పూర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌పైనా సెలెక్టర్లు దృష్టి పెట్టనున్నారు. ఈ మ్యాచ్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు లేకపోయినా, జట్టును పరీక్షించే మంచి అవకాశం అని భావిస్తున్నారు. మొత్తంగా, ఐపీఎల్ 2026 భారత క్రికెట్‌కు కొత్త దిశను చూపించబోతోంది. ఈ సీజన్‌లో మెరిసే ఆటగాళ్లే 2027 ప్రపంచకప్‌లో భారత జెర్సీ ధరించే అవకాశం ఉంది.

Venkat

Venkat

Next Story