Photo controversy: శాంసన్‌పై అంత కసి ఎందుకు బ్రో.. ఒక్క ఫొటోతో ఇజ్జత్ పాయే..? గిల్‌పై ఫ్యాన్స్ గరం గరం
Shubman Gill, Sanju Samson Photo controversy: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటో వివాదానికి దారితీసింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో సంజూ శాంసన్ కనిపించకపోవడంతో అతన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించాడనే ఆరోపణలు వచ్చాయి.
Photo controversy: శాంసన్‌పై అంత కసి ఎందుకు బ్రో.. ఒక్క ఫొటోతో ఇజ్జత్ పాయే..? గిల్‌పై ఫ్యాన్స్ గరం గరం
Shubman Gill, Sanju Samson Photo controversy: భారత్ క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men's T20 World Cup 2026) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand)పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలిచింది.
టోర్నమెంట్ హీరోగా సంజూ శాంసన్..
ఈ టోర్నమెంట్లో భారత జట్టు తరపున సంజూ శాంసన్ (Sanju Samson) హీరోగా నిలిచాడు. ప్రారంభంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లేకపోయినా, అవకాశం వచ్చినప్పుడల్లా అద్భుతంగా ఆడాడు. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 321 పరుగులు చేసి భారత జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 80.25 సగటుతో అద్భుత ప్రదర్శన చేసిన శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
వైరల్ అవుతోన్న ఫోటో వివాదం..
భారత్ విజయం అనంతరం శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సోషల్ మీడియాలో జట్టు సంబరాల ఫోటోను షేర్ చేసి, ఛాంపియన్స్ అంటూ టైటిల్ ఇచ్చాడు. ఈ ఫోటోలో సంజూ శాంసన్ కనిపించకపోవడంతో కొంతమంది అభిమానులు గిల్ ఉద్దేశపూర్వకంగా అతన్ని ఫోటో నుంచి తొలగించాడని ఆరోపించారు.
సంజూ శాంసన్ భారత జట్టులో తన స్థానాన్ని తీసుకున్నందుకు గిల్ అసూయతో ఇలా చేశాడనే వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్యాక్ట్ చెక్‌లో బయటపడిన నిజం..
ఈ ఆరోపణలు నిజం కావని పరిశీలనలో తేలింది. గిల్ షేర్ చేసిన అదే ఫోటోను భారత ఆటగాళ్లు శివం దుబే (Shivam Dube), రవి చంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwi)n కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కూడా అదే ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో ఆ ఫోటో టీమ్ సెలబ్రేషన్స్ సమయంలో తీసిన అసలు ఫోటోనే అని స్పష్టమైంది.
వేర్వేరు ఫోటోలు కావడంతో గందరగోళం..
కొంతమంది అభిమానులు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) షేర్ చేసిన మరో ఫోటోతో గిల్ ఫోటోను పోల్చారు. ఆ ఫోటోలో సంజూ శాంసన్ కొంతవరకు కనిపించడం వల్ల గిల్ ఫోటోను ఎడిట్ చేశారని అనుమానం వ్యక్తమైంది. అయితే రెండు ఫోటోలు వేర్వేరు సమయాల్లో తీసినవని తర్వాత స్పష్టమైంది.
IPLలో మళ్లీ మైదానంలోకి..
ఇక త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2026) లో ఈ ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ మైదానంలో కనిపించనున్నారు.
గిల్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు సంజూ శాంసన్ భారీ ట్రేడ్ డీల్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడనున్నాడు.




