IPL 2026: ఇదేందిరా సామీ.. చెన్నైకు షాకిస్తోన్న ఆసీస్ ఆటగాళ్లు.. ఎంతమందో తెలుసా?
Chennai Super Kings Injury Players: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక విదేశీ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవుతుండటంతో జట్టు సమతౌల్యం దెబ్బతింటోంది. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం సీఎస్‌కే వ్యూహాలపై ఎఫెక్ట్ పడేలా ఉంది.
IPL 2026: ఇదేందిరా సామీ.. చెన్నైకు షాకిస్తోన్న ఆసీస్ ఆటగాళ్లు.. ఎంతమందో తెలుసా?
Chennai Super Kings Injury Players: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నమెంట్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో, మరో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ కూడా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
బొటనవేలు విరగడంతో షార్ట్ కొంతకాలం జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. రెండో దశలో తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ప్రారంభ మ్యాచ్‌లలో అతని గైర్హాజరీ సీఎస్‌కేకు పెద్ద లోటుగా మారింది.
జట్టు కాంబినేషన్‌పై భారీ ఎఫెక్ట్..
మాథ్యూ షార్ట్ సీఎస్‌కే జట్టులో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ ఆఫ్-స్పిన్నర్ కావడం విశేషం. అతను లేకపోవడం వల్ల జట్టులో స్పిన్ విభాగం తేలిపోనుంది. దీంతో తుది జట్టులో సమతౌల్యం దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే తమ విదేశీ ఆటగాళ్ల ఎంపికలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెవాల్డ్ బ్రూయిస్, జేమీ ఓవర్‌టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ వంటి ఆటగాళ్లపై ఆధారపడే అవకాశముంది.
నాథన్ ఎల్లిస్ గాయం..
ఇప్పటికే సీఎస్‌కేకు పెద్ద దెబ్బగా మారింది నాథన్ ఎల్లిస్ గాయం. కండరాల గాయం కారణంగా అతను మొత్తం ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యాడు. డెత్ బౌలింగ్‌లో అతను కీలక పాత్ర పోషిస్తాడని చెన్నై జట్టు భావించింది.
అతని గైర్హాజరీతో చివరి ఓవర్లలో పరుగులు అదుపులో పెట్టడం సీఎస్‌కేకు పెద్ద సవాలుగా మారనుంది.
ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట..
జట్టు కష్టాలను అధిగమించేందుకు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. నివేదికల ప్రకారం, దక్షిణాఫ్రికా బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.
మేజర్ లీగ్ క్రికెట్‌లో సీఎస్‌కే మరో జట్టు టెక్సాస్ సూపర్ కింగ్స్‌లో ఇప్పటికే సభ్యుడిగా ఉండటంతో అతన్ని జట్టులోకి తీసుకోవడం మంచిదని భావిస్తోంది.
ముందున్న సవాళ్లు..
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, జట్టు యాజమాన్యం ఇప్పుడు సరైన కాంబినేషన్ కోసం కృషి చేస్తున్నారు. వరుస గాయాలతో జట్టు బలహీనపడినప్పటికీ, సరైన వ్యూహంతో తిరిగి బలంగా నిలబడాలని సీఎస్‌కే లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లలో ఈ సమస్యలు ఎలా ప్రభావం చూపిస్తాయో చూడాలి.




