Chaitra Amavasya: కొత్త అమావాస్య.. ఉగాది ముందురోజు వచ్చే దీని ప్రత్యేకత తెలుసా?

Chaitra Amavasya: ఉగాదికి ఒకరోజు ముందు వచ్చే అమావస్యను తెలుగు రాష్ట్రాల్లో కొత్త అమవస్యగాను.. ఉత్తరాది రాష్ట్రాల్లో చైత్ర అమావస్యగాను జరుపుకుంటారు.

KVD Varma
Published on: 17 March 2026 7:28 PM IST
Chaitra Amavasya: ఉగాదికి ఒకరోజు ముందు వచ్చే అమావస్యను తెలుగు రాష్ట్రాల్లో కొత్త అమవస్య
X

Chaitra Amavasya

Chaitra Amavasya: మనమంతా ఉగాది వస్తోంది.. కొత్త సంవత్సరం వస్తుంది. పంచాంగం తెస్తుంది. వేప పువ్వు పచ్చడి షడ్రుచులు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ, ఉగాదికి సరిగ్గా ఒకరోజు ముందు మరింత ముఖ్యమైన పండగ ఒకటి ఉంది. పల్లెటూళ్లలో ఉండే వారికీ ఇది బాగానే తెలుస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా దీనిని నిర్వహిస్తారు. నిజానికి ఉగాది రెండురోజుల పండుగ. చైత్ర మాసం ప్రారంభం ముందు వచ్చే అమావాస్య ఒక పండుగ కొత్త అమావాస్యగా మన దగ్గర జరుపుకుంటారు. చైత్ర అమావాస్య పేరుతో ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. తరువాత పాడ్యమి రోజు వచ్చేది ఉగాది పండుగ.

పెద్దల పండుగ..

కొత్త అమావాస్య రోజు పెద్దలకు (అంటే చనిపోయిన వారికి ) ఉదయాన్నే తర్పణాలు వదలడం. వారి పేరు మీద బట్టలు పెట్టడం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఆ రోజున ఊరి పొలిమేరల్లో ఉండే దేవతలకు ప్రత్యేక జాతర నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉంది. ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో నూకాలమ్మ జాతర నిర్వహిస్తారు. అలాగే పొలిమేరలో ఉండే దేవతలకు పండుగ చేస్తారు. ఉగాది కంటే ఆయా ప్రాంతాల్లో ఈపండుగకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొత్త అమావాస్య అని చెప్పుకుంటూ జరుపుకునే ఈ పండుగ రోజు ఊళ్లన్నీ కోలాహలంగా మారిపోతాయి.ఇళ్లన్నీ బంధువులతో కళకళలాడిపోతాయి. ప్రాంతాన్ని బట్టి పండుగ తీరులో మార్పు ఉండవచ్చు కానీ, పండుగ సందడి మాత్రం ఒకేలా ఉంటుంది.

ఇక ఉత్తరాది విషయానికి వస్తే చైత్ర అమావాస్యగా ఈ పండుగను చెబుతారు. ఇక్కడ కూడా పితృ దేవతలకు తర్పణలు వదలడం చేస్తారు. ఉత్తరాదిన అమావాస్య అంటేనే పితృదేవతలకు ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందులోనూ ఈ చైత్ర అమవస్యను పెద్దలకు చెందినా రోజుగా శ్రద్ధగా ఆచరిస్తారు. అలాగే ఈరోజున ఎవరి వీలును బట్టి వారు దాన ధర్మాలు చేస్తారు. పిత్రుదేవతల పేరుపై ప్రత్యేకంగా దానధర్మాలను నిర్వహిస్తారు. అలాగే, ఆవులు, చీమలు వంటి జీవులకు ఆహారాన్ని పెట్టడం కూడా ప

విత్ర కార్యంగా భావిస్తారు. రావి చెట్టు కింద ఆవనూనె దీపాన్ని వెలిగించి, నల్ల నువ్వులు, మినపపప్పు వంటి నైవేద్యాలను సమర్పించడం అనేది సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్మే మరో సాధారణ ఆచారం.

అదండీ సంగతి రెండురోజుల ఉగాది పండుగలో పెద్దలను స్మరించుకునే ఆచారం.. జీవితం ఉన్నతంగా ఉండాలని జరపుకునే ఉత్సవం రెండూ కలగలిపి ఉంటాయి.

గమనిక: ఈ ఆర్టికల్ సాధారణ హిందూ మత ఆచారాలపై వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం సమాచార మాత్రంగా ఇచ్చాం. ఆచార వ్యవహారాల విషయంలో ఎవరి నమ్మకానుసారం వారు ఉండవచ్చు. ఇలానే చేయాలని ఈ ఆర్టికల్ ఎవరికీ సూచించడం లేదు.

KVD Varma

KVD Varma

Next Story