Sri Rama navami: మార్చి 26 లేదా 27.. ఈసారి శ్రీరామ‌నవ‌మి ఎప్పుడు.? స‌రైన స‌మ‌యం ఏంటి.?

Sri Rama navami: భారతదేశంలో అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. భక్తులు ఈ పండుగను ఎంతో భక్తి, ఉత్సాహంతో జరుపుకుంటారు.

Mokshith
Published on: 24 March 2026 2:12 PM IST
Sri Rama navami
X

Sri Rama navami: మార్చి 26 లేదా 27.. ఈసారి శ్రీరామ‌నవ‌మి ఎప్పుడు.? స‌రైన స‌మ‌యం ఏంటి.?

Sri Rama navami: భారతదేశంలో అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. భక్తులు ఈ పండుగను ఎంతో భక్తి, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి జన్మదినంగా భావిస్తారు. అందుకే దేశవ్యాప్తంగా ఆలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈసారి రామ న‌వ‌మి ఎప్పుడు.?

ఈ ఏడాది శ్రీరామ న‌వ‌మి 26న లేదా 27న అనే వాద‌న‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ ఏడాది రామ నవమి 2026 మార్చి 27న జరుపుకోనున్నారు. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథిన ఈ పండుగ వస్తుంది.

నవమి తిథి మార్చి 26, 2026 ఉదయం 11:48 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. నవమి తిథి మార్చి 27, 2026 ఉదయం 10:06 గంట‌ల‌కు ముగియ‌నుంది. రామ నవమి మధ్యాహ్న క్షణం: మార్చి 27 – మధ్యాహ్నం 12:27 గంట‌లకు కాగా,

మధ్యాహ్న పూజా ముహూర్తం: ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు ఉండ‌నుంది. ఈ సమయంలో శ్రీరాముడికి పూజలు చేయడం అత్యంత శుభంగా భావిస్తారు.

శ్రీరామ నవమి ప్రాముఖ్యత

చైత్ర నవరాత్రులు ప్రారంభమైన తొమ్మిదో రోజునే రామ నవమి వస్తుంది. ఈ రోజు అయోధ్యలో రాజు దశరథుడు, కౌసల్యాదేవికి జన్మించిన శ్రీరాముడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. శ్రీరాముడి జీవితం నేటి త‌రానికి కూడా ఎంతో ఆద‌ర్శం. సత్యం, ధర్మం, న్యాయం అనే సూత్రాల ఆధారంగా ఆద‌ర్శ‌జీవితం ఆయ‌న‌ది. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు.

నవమి రోజున చేసే పూజలు

శ్రీరామ నవమి రోజున భక్తులు ఉదయం తొందరగా లేచి స్నానం చేసి దేవాలయాలకు వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుంటారు. ఇళ్లలో రామచరితమానస్ పారాయణం చేస్తారు. ఆలయాల్లో శ్రీరామ క‌ళ్యాణాన్ని నిర్వ‌హిస్తారు. అనంత‌రం అన్న‌దానం నిర్వ‌హించారు.

ఇక న‌వ‌మి చైత్ర నవరాత్రుల చివరి రోజు కూడా కావడంతో కొంతమంది ఇంటికి చిన్నపిల్లలను ఆహ్వానించి కన్యాపూజ చేస్తారు. వారికి భోజనం పెట్టి బట్టలు, అవసరమైన వస్తువులు అందిస్తారు. అయితే ఎక్కువ‌గా ఉత్త‌రాధి రాష్ట్రాల్లోనే క‌నిపిస్తుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story